అమరావతి (చైతన్యరథం): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన మాదాబత్తుల తిరుమల శ్రీదేవికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. శ్రీదేవి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నేషనల్ అవార్డుకు ఎంపిక కావడం మన రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పండిట్ నెహ్రూ మున్సిపల్ హైస్కూలు హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్న శ్రీదేవి టీచర్ Come to learn- go to serve the nation నినాదంతో వినూత్న బోధనాపద్ధతితిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరు ఉపాధ్యాయలోకానికి స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి లోకేష్ కొనియాడారు.