అమరావతి (చైతన్యరథం): వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు నమోదు కావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల పాటు హీరోగా సాగిన బాలకృష్ణ అపూర్వమైన సినిమా జైత్రయాత్రకి దక్కిన గౌరవంగా ఈ గుర్తింపు నిలుస్తుందన్నారు. బాలకృష్ణ అటు తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూనే తన అద్వితీయమౌన నటనతో అన్ని వర్గాల ప్రేక్షలకులను అలరిస్తున్నారని కొనియాడారు. అన్నితరాల సినిమా ప్రేమికులను అభిమానులుగా చేసుకున్న ప్రతిభ బాలయ్యకే సొంతమన్నారు. సినీ రంగంలోనే కాకుండా గత 15 సంవత్సరాలుగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించంటంతో బాలకృష్ణ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.