అమరావతి (చైతన్యరథం): లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో నట సింహం నందమూరి బాలకృష్ణకు స్థానం దక్కటం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సినీ రంగంలో 50 సంవత్సరాలు అద్భుతంగా పూర్తి చేసుకున్నందుకు ప్రియమైన బాల మావయ్యకు అభినందనలు. ఈ ప్రత్యేక సందర్భంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన స్థానం సంపాదించడం మా కుటుంబానికి, తెలుగు సినిమా అభిమానులందరికీ గర్వకారణం. ఆయన అభిరుచి, క్రమశిక్షణ, కళ పట్ల ప్రేమ మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.