అమరావతి (చైతన్యరథం): పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, సమాజం, ప్రజా జీవితానికి చిరంజీవి చేసిన అద్భుతమైన కృషి గర్వకారణమన్నారు. ఎందరికో ప్రేరణ ఇస్తుందన్నారు. చిరంజీవి మరిని సంవత్సరాలు మంచి ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.