- జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల ఆకాంక్ష వెల్లడి
- 5 ఏళ్ల జగన్ పాలన.. బాబు పాలన మధ్య తేడా చూసిన పులివెందుల ప్రజలు
- మారే కాలంతో మారక ఇంకా రాజారెడ్డి మైండ్ సెట్‌తో ఉన్న జగన్
- ఆత్మస్తుతి… పరనిందతో వైకాపా పడవ మునిగిపోకుండా ఉంటుందా?
- అవినీతి విషపుత్రిక సాక్షి ఉద్యోగి వర్ధెల్లి మురళి కుతంత్రం- 29
17.08.2025 ఆదివారం సాక్షి ఎడిట్ పేజీలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలపై ఆత్మస్తుతి పరనిందతో మరో భారీ వ్యాసం రాశారు. రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణలో అధర్మం నాలుగు పాదాలపై నడిచిందని, ప్రజాస్వామ్యం వివస్త్రకు గురైందని జగన్ పాలనా దారుణాల్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే కుట్ర చేశారు.
ప్రజాస్వామ్యానికి పాతరేసింది జగన్ జమానాలోనే:
జగన్ పాలనలో పంచాయతీ ఎన్నికల్లో జరిగిన నేరాలు… ఘోరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల్లో పెట్టిన అక్రమ కేసులు 322
ఆస్తుల విధ్వంసం 118
హత్యా ప్రయత్నాలు 48
హత్యలు 3
కిడ్నాపులు 51
బలవంతపు నామినేసన్ల ఉపసంహరణ 1045
బలవంతపు ఏకగ్రీవాలు
నియోజకవర్గం మొత్తం పంచాయితీలు ఏకగ్రీవాలు
పుంగనూరు 85 85
పులివెందుల 108 90
మాచర్ల 77 74
కుప్పం, తిరుపతి, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో నేరాలు, ఘోరాల తీరు
మున్సిపాలిటీ మొత్తం కౌన్సిలర్లు/ కార్పొరేటర్లు వైసీపీ కొట్టేసినవి
కుప్పం 25 19
తిరుపతి 50 49
నెల్లూరు 54 54
కుప్పం 14వ వార్డులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న దళిత యువకుడు డాక్టర్ వెంకటేష్‌ను బుల్లెట్ మోటార్ సైకిల్‌తో ఢీకొట్టి గాయపరచారు. నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేశారు. మరో సెట్‌తో రెండోసారి నామినేషన్ వేస్తే ప్రతాలన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. కానీ అభ్యర్థల జాబితాలో వెంకటేష్ పేరు మాయం చేశారు.
కుప్పంలోని మరో వార్డులో ప్రకాష్ ఆయన భార్య తిరుమంగల్ నామినేషన్ వేస్తే వారి సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఇలా అనేక వార్డుల్లో చేశారు.
తమిళనాడు నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై దాడులు చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టారు. కుప్పం ఎన్నికల్లో పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యానికి పాతరేశారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి లాగిన్ ఐడీని వైసీపీ నేతలు దుర్వినియోగం చేసి దొంగ ఓట్ల ఐడీలు వేలాదిగా డౌన్‌లోడ్ చేశారు. ఇది రుజువైనందున కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు. తహసిల్దార్‌తోపాటు అనేకమంది అధికారులు సస్పెండ్ అయ్యారు.
తిరుపతిలో ఓటు వేసేందుకు పుంగనూరు, పీలేరు తదితర ప్రాంతాల నుండి అనేక బస్సుల్లో దొంగ ఓటర్లను వేలాదిగా తరలిస్తూ పట్టుబడ్డారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరాలు నేరాలు చేసి జగన్ ముఠా ప్రజాస్వామ్యానికి పాతర వేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు.
పులివెందులలో ఎవరి నామినేషన్లు బలవంతంగా లాక్కోలేదు. అందుకే 11మంది పోటీ చేశారు. 30 ఏళ్లు ఎన్నికలు జరపని స్థానంలో ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి.
వివేకానందరెడ్డికి న్యాయం జరగాలని బ్యాలెంట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్పులు వేశారు. అలాగే 30ఏళ్ల తరువాత ఓటు వేశామని సంతోషం వ్యక్తం చేశారు.
ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లో పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఓడారు. దీనిపై సరైన గుణపాఠాలు తీసుకోకుండా ఆత్మస్తుతి పరనిందకు పాల్పడుతూ వైకాపా పడవను స్వయంగా ముంచుకుంటున్నారు.
పులివెందులలో ఓటమికి నిజమైన కారణాలు ఇవి:
1. రక్తపు పులివెందుల వద్దు, కొత్త పులివెందుల కావాలనే ప్రగాఢ కాంక్షను ఈ ఎన్నికల ఫలితం వెల్లడి చేస్తోంది.
2. భయపడే బతుకు వద్దు, స్వేచ్ఛ కావాలనే సంకేతాన్ని ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చాయి.
3. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలెండర్లు, పింఛన్లు, అన్న క్యాంటీన్లు డీఎస్సీ, రోడ్ల నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, పారిశ్రామిక ప్రగతి తిరిగి ప్రారంభం ఓటర్లపై ప్రభావం చూపాయి.
4. ఐదేళ్ల జగన్ పాలనలో పులివెందులకుగాని, రాయలసీమకుగాని ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. చంద్రబాబు పాలనలో రాయలసీమకు అన్ని విధాలా మేలు జరిగిందని ప్రజలు గుర్తించారు.
5. చంద్రబాబు ప్రవేశపెట్టిన డ్రిప్‌వల్ల రాయలసీమలో ఉద్యానవన పంటలు బాగా పెరిగాయి. పులివెందుల ఉద్యానవన పంటలు విశేషంగా పెరిగాయి.
6. గండికోట నుండి చంద్రబాబు సాగునీరు అందించారు.
7. ఐటీ విప్లవంతో పులివెందుల యువత సైతం బాగా లబ్ది పొందారు. అలాగే గల్ఫ్ ఉద్యోగ అవకాశాల్ని కడప జిల్లా బాగా అందిపుచ్చుకుంది.
8. ఉన్నత విద్య, వ్యాపార రంగాల్లో ప్రగతి జరిగింది.
9. 50 ఏళ్ల క్రితం అతి పేదరికం, నిరుద్యోగం వల్ల రాజారెడ్డి నేర రాజకీయాలకు కిరాయి మనుషులు పుష్కలంగా దొరికేవారు. ఇప్పుడు పులివెందుల ఉద్యానవన హబ్ అయింది. తలసరి ఆదాయంలో పులివెందులలోని లింగాల మండలం రాష్ట్రంలో మొదటి స్థానంలోకి వచ్చింది.
10. ప్రజా జీవితంలో వచ్చినపై మార్పుల కారణంగా రక్తపాత రాజకీయాలపై వ్యతిరేకత వచ్చింది. భయం స్థానంలో స్వేచ్ఛా కాంక్ష ప్రజల్లో పెరిగింది. ఈ మార్పునకు అనుగుణంగా జగన్ మారకుండా తన తాత దారినే అనుసరించాడు.
11. వివేకా హంతకులకు రక్షణ ఇవ్వడాన్ని పులివెందుల ప్రజలు, వైఎస్ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు.
12. స్వేచ్ఛగా ఓటువేసే స్థితి బీటెక్ రవి, శ్రీనివాసులరెడ్డి నాయకత్వాన కూటమి నేతలు కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం ఓటర్లకు రక్షణ కల్పించింది.
13. బెదిరింపులు, ప్రలోభాలు, అబద్ధాలకు కాలం చెల్లింది. కనుక జగన్ తన తాత మైండ్‌సెట్ మార్చుకుని ప్రజాస్వామ్య పంథాలోకి మారకపోతే వైసీపీ పడవ మునగడం ఖాయం.
14. రప్పా రప్పా నరుకుడు ధోరణి… ఆత్మస్తుతి పరనిందలోనే మునిగి తేలుతామంటే ఇక వైసీపీ కోలుకునే స్థితే ఉండదు గాక ఉండదు.
`గుజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్