- ఉచిత బస్సు భారం కాదు..బాధ్యత
- ఆరు రోజుల్లో 65 లక్షల మంది ప్రయాణం
- లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులపై ఆలోచిస్తున్నాం
- మహిళా ప్రయాణికుల భద్రతకు రాజీ పడం
- తిరుమలకూ ఫ్రీ బస్సుపై ఆలోచన చేస్తున్నాం
- రెండేళ్లలో ఏసీ బస్సులుగా పల్లెవెలుగు బస్సులు
- బస్సుల్లో సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలు ఏర్పాటు
- అతి త్వరలో కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తాం
- రవాణా మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి
విజయవాడ(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం మహిళామూర్తు లకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అందించిన మరో కానుక స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ అయిందని రవాణా మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం సక్సెస్ సందర్భంగా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్టీసీ అధికారులతో మంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రా ల్లో పథకం అమలు తీరును అధ్యాయనం చేసిన తరువాతనే మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. పథకం అమలు తీరులో చిన్న చిన్న లోటుపాట్లు సహజమని, ఒడిదుడుకులను తట్టుకుని సద్విమర్శలను పరిగణలోకి తీసుకుని పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నా రు. స్త్రీ శక్తి పథకం అమలు ప్రభుత్వానికి భారం కాదని, బాధ్యత అని తెలిపారు. సంక్షేమ పథకాలు అన్నింటిలో స్త్రీ శక్తి పథకం టాప్‌లో ఉంటుందన్నారు. ఈ ఆరు రోజుల్లో 65 లక్షల మందికి పైగా మహిళలు ఫ్రీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. ఆర్టీసీకి ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుందని తెలిపారు. ఫ్రీ బస్సు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందించే యోచనలో ఉన్నామని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతి బస్సు లో సీసీ కెమెరాలు, కండెక్టర్లకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయను న్నామని తెలిపారు. ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకుంటామని, కార్గో సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రయాణికుల రద్దీకి అవసరమైన కొత్త బస్సులను కొనుగోలు చేయలేదన్నారు.
కూటమి ప్రభుత్వం త్వరలో 750 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానుందని, మరో నాలుగేళ్లలో 2500 కు పైగా నూతన బస్సులను కొనుగోలు చేయనున్నామని తెలిపా రు. నూతనంగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులే అని వివరించారు. దాంతో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పల్లె వెలుగు బస్సులు సైతం ఏసీ బస్సులే ఉంటాయని చెప్పారు. కొండ (ఘాట్ రోడ్) ప్రాంతాల్లో సైతం ఫ్రీ బస్సు అమలు చేస్తున్నామని, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నా యని, మరో వారంరోజుల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుమలకు కూడా ఫ్రీ బస్సు అమలుపై సాధ్యాసాధ్యా లను పరిశీలిస్తున్నామన్నారు. అలాగే సాంకేతిక సమస్యలను పరిష్కరించి అతి త్వరలోనే తిరుమలకు ఫ్రీ బస్సుపై అనుకూల ప్రకటన వస్తుందన్నారు. త్వరలో కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు పథకం ఆర్టీసీ సంస్థలోని దాదాపు 75 శాతం బస్సుల్లో వర్తిస్తుందన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవా లని, ఆర్థిక వెసులుబాటును పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలా ల్ దండే, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.