ఢిల్లీ (చైతన్య రథం): అమరావతిలో హడ్కో కన్వెన్షన్ సెంటర్‌కు హడ్కో బోర్డు ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లేఖ రాశారు. గుంటూరులో సీఆర్డీఏ కేటాయించిన 8 ఎకరాల కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది. మరో రెండెకరాలు కూడా సీఆర్డీఏ కేటాయించాల్సి ఉందని హడ్కో తెలిపింది. ఒక్కో ఎకరం రూ.4కోట్లకు కొనుగోలుకు బోర్డు ఆమోదించింది. మొత్తం 10 ఎకరాల్లో హడ్కో కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి అనుమతులకు ఆమోదం లభించింది. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా కేంద్రమంత్రి పెమ్మసాని వివరాలు వెల్లడిరచారు.