అమరావతి (చైతన్య రథం): ఏపీలో నిర్వహించిన ‘ఆవిష్కరణ ఆంధ్ర’ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆన్‌లైన్‌లో 24 గంటల్లో అత్యధిక పారిశ్రామికవేత్తలు పేర్లు నమోదు చేసుకున్నారు. 1.67 లక్షలమంది దరఖాస్తు చేసుకోవడంతో ప్రపంచ రికార్డు లభించింది. రికార్డు సర్టిఫికేట్‌ను గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు అందించారు. ఆవిష్కరణ ఆంధ్రపై నేతలు, పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు. ప్రతీ కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేసే దిశగా కృషి చేస్తామని చంద్రబాబు, లోకేశ్, పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు.