- గోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి
- సీఎం చంద్రబాబు మానస పుత్రిక
- వినూత్న ఆలోచనలకు ప్రత్యేక శిక్షణ
- మంత్రి నిమ్మల రామానాయుడు
- రాజమండ్రిలో స్పోక్ కేంద్రం ప్రారంభం
- పాల్గొన్న మరో మంత్రి కందుల దుర్గేష్
రాజమండ్రి(చైతన్యరథం): రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబు మానస పుత్రిక..ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, గోదావరి జిల్లాలు వ్యవసా యంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌లు పేర్కొన్నారు. సాంకేతికత-యువత కలయికతో చిన్న ఆవిష్కరణలు కూడా పెద్ద పరిశ్రమ లుగా ఎదగగలవని, రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం లేదా వ్యాపారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళ వారం ఉదయం రాజమండ్రి రూరల్ బొమ్మూరులో అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
సీఎం చంద్రబాబు మానస పుత్రికగా ఈ హబ్‌ను అభివర్ణించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపు రం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ హబ్‌లతో యువతలోని నైపుణ్యా లను వెలికితీసి కొత్త ఆవిష్కరణల ద్వారా నిరుద్యోగ నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయంలో ముందున్న గోదావరి జిల్లాలు, పారిశ్రామిక రంగంలో కూడా ముందువరుసలో నిలుస్తా యని విశ్వాసం వ్యక్తం చేశారు. యువతకు పెద్దఎత్తున అవకాశా లు కల్పిస్తూ, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పాలనలో పరిశ్రమ లు వెనక్కి తగ్గితే, చంద్రబాబు, లోకేష్ వాటిని తిరిగి రప్పిస్తున్నా రని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువత కు ప్రభుత్వం పరిశ్రమల సహకారంతో ప్రత్యేక శిక్షణ అందిస్తుం దని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గోదావరి జిల్లాలకు పారిశ్రా మిక బాటలు వేసిందని అన్నారు.
సాంకేతికత-యువత కలయికతో కొత్త యుగం
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలోని ప్రతిభకు సాంకేతిక సహకారం లభి స్తుందని అన్నారు. చిన్న స్థాయి ఆవిష్కరణలు కూడా పెద్దస్థాయి పరిశ్రమలుగా ఎదగడానికి ఈ కేంద్రం పునాది వేస్తుందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలు సృష్టించడం, పరిశ్రమలతో కలిసి శిక్షణ- ప్రోత్సాహం అందించడం ద్వారా గోదావరి జిల్లాలు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాబోయే తరానికి దిక్సూచి
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బొమ్మూరు పాలిటెక్నిక్ చరిత్రలో ఇది కొత్త మైలురాయిగా నిలు స్తుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు ఇస్తూ ఇది యువతకు దిశా నిర్దేశం చేసే కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, గ్రీన్ కోర్ చైర్మన్ జి.రాంబాబు, నన్నయ యూనివర్సిటీ వీసీ వి.ప్రసన్న, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఛాన్సలర్ కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఆదిత్య యూనివర్సి టీ చైర్మన్ శేషారెడ్డి, గెయిల్ ప్రతినిధి కేవీఆర్ రావు, ఓఎన్‌జీసీ ప్రతినిధి కేవీకేరాజు, తాడేపల్లి గూడెం ఎన్‌ఐటీ ప్రతినిధి రవికిరణ్ శాస్త్రి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రతినిధి శ్రీరామ్, జిల్లా పరిశ్రమ అధికారి వనిధర్ రామన్, తదితరులు పాల్గొన్నారు.