- అక్కసుతోనే వైసీపీ విష ప్రచారం
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
అమరావతి (చైతన్యరథం): మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంతోషం కలిగించే ప్రతీ పథకాన్ని అవహేళన చేయటం, దుష్ప్రచారం చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగ్విజయంగా అమలవుతున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి కడుపుమంటతో ఓర్వలేకపోతోందన్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డుల లాంటివి జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు కూడా అనుమతిస్తున్నామని తెలిపారు. ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం దిగ్విజయంగా అమలు కావడం వైసీపీ వారికి మింగుడు పడటం లేదని ధ్వజమెత్తారు. లక్షలాది మంది అక్క, చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలులో అవసరమైతే నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ, అక్కసుతో వ్యతిరేక ప్రచారం చేయటాన్ని ప్రజలు హర్షించబోరన్నారు.