- తక్షణ చర్యలు తీసుకోవాలి
- కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లోకేష్ వినతి
న్యూఢిల్లీ (చైతన్యరథం): విజయవాడలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు ` మచిలీపట్నం నడుమ 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ న్యూఢల్లీిలో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడతూ… ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కానూరు ` మచిలీపట్నం రోడ్డు విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతోపాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా ఉపకరిస్తుందన్నారు. హైదరాబాద్ ` అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్‌హెచ్ ` 65 కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ ` గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజిని డీపీఆర్‌లో చేర్చండి. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించండి.
విశాఖ, విజయవాడల్లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు
ఎన్‌హెచ్ ` 16 వెంట విశాఖపట్నంలో 20 కి.మీ.లు, విజయవాడలో 14.7 కి.మీ.ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్లను నాగపూర్ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఎన్‌హెచ్‌ఎఐ, రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో డీపీఆర్ రూపకల్పన, వ్యయాన్ని భరించే అంశంపై చర్చ జరిగింది. ఏపీలో రీజనల్ కనెక్టివిటీ, డెవలప్‌మెంట్ కారిడార్ల అభివృద్ధిలో భాగంగా కర్నూలు ` ఎమ్మిగనూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుకొండ-గుంటూరు నడుమ ఎన్ హెచ్ 544డి, కాకినాడ పోర్టు ` ఎన్‌హెచ్ 216 నడుమ దక్షిణ రహదారి, కాణిపాక వినాయక దేవాలయం లింకు రోడ్డు నిర్మాణ పనుల చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.
బెంగళూరు ` చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ హై వే (ఎన్‌ఇ-7) రహదారికి డైరెక్ట్ కనెక్టవిటీ కోసం కుప్పం-హోసూరు ` బెంగుళూరు నడుమ 56 కి.మీ.ల మేర రూ.3వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రికి లోకేష్ విన్నవించారు. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (కాడా) ప్రాంతంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్… గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు భద్రతా ప్రమాణాల మెరుగుదల, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, లాజిస్టిక్స్, పాసింజర్ కారిడార్ల ఇంటిగ్రేషన్ ఆవశ్యకతను వివరించారు. కేంద్రప్రభుత్వ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్థిరమైన మోడరన్ కనెక్టివిటీ కోసం గ్రీన్ కారిడార్లు, అధునాతన టోలింగ్, రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచార వ్యవస్థల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తిచేశారు.