- వరదలపై తప్పుడు వార్తలు క్షమించరాని నేరం
- చర్యలు తప్పవని మంత్రి నిమ్మల స్పష్టీకరణ
పాలకొల్లు (చైతన్యరథం): లేనిపోని అనుమానాలు, ఆందోళనలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీది క్షమించరాని నేరమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అవాస్తవాలు, అర్ధసత్యాలతో ప్రశాంత ప్రజాజీవనానికి భంగం కలిగించే వాళ్లెవరైనా తీవ్ర నేరగాళ్లతో సమానమేనన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసి, అన్నదాతలకు వైసీపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించడం, ఆందోళనలు సృష్టించడం క్షమించరాని నేరంగా ఆయన పేర్కొన్నారు. నీటి వనరుల పైన, నిర్వహణ సామర్థ్యం పైన విష ప్రచారం చేస్తూ ప్రజలపై వరద భయాన్ని రుద్దడాన్ని తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్రంలో 70 శాతం మందికి ప్రధాన వృత్తి, ఆదాయ వనరు వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ రంగానికి ఆధారమైన ఇరిగేషన్ శాఖను వైసీపీ పాలనలో విధ్వంసం చేశారన్నారు. ఈ శాఖను గాలికి వదిలేసిన చేతకాని వైసీపీ… నేడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు.
భయాందోళనలకు గురి చేయడమే ధ్యేయం
పోలవరం కాఫర్ డ్యామ్‌కు గండిపడిరది..బెజవాడ మునిగిపోతుంది.. పొన్నూరులో పొలాలు మునిగాయి.. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతాయి.. అంటూ వైసీపీ, దాని రహస్య మిత్రులు లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. రాజకీయ ముసుగులో వారు చేస్తున్న విష ప్రచారంలో వీసమెత్తైనా వాస్తవం లేదని మంత్రి రామానాయుడు తీవ్రంగా ఖండిరచారు. కూటమి ప్రభుత్వానికి రోజురోజుకీ జనాల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. పరిస్థితి ఇలాగే సాగితే వైసీపీ కూకటి వేళ్ళతో కూలిపోతుందనే భయంతోనే వివిధ వేదికల ద్వారా విషం చిమ్ముతున్నారని విశ్లేషించారు. పోలవరం కాఫర్ డ్యామ్ పక్కనున్న రోడ్డుకి చిన్నపాటి గొయ్యిపడి మట్టి జారితే … ఏకంగా కాఫర్ డ్యాంకి గండి పడ్డట్లుగా ప్రచారం చేశారంటే వారి అవగాహన ఏపాటితో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో పొలాలు మునిగిపోవడానికి .. కొండవీటి వాగు మళ్లింపు కారణం కాదన్నారు. పొన్నూరులో ఒకరోజు వ్యవధిలో 170 మి.మీ. నుండి 200 మి.మీ. వరకు భారీ వర్షపాతం నమోదైన కారణంగా వర్షపు నీరు పంటకాలువలు, మురుగుకాలువల ద్వారా పొలాల్లోకి చేరి మునిగిపోయాయన్నారు. కొండవీటి వాగు వరదనీటిని పంపింగ్ పథకం ద్వారా కృష్ణానదిలోకి మళ్లిస్తున్నారే గాని కృష్ణా కాలువలకు మళ్లించడం లేదన్నారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ, గుంటూరు ఛానల్, అప్పాపురం ఛానల్‌ను వర్షాల కారణంగా మూసివేశారన్నారు.
కొండవీటి వాగు వరద నీటిని 16 గేట్ల ఔట్‌ఫాల్ రెగ్యులేటర్ ద్వారా ప్రకాశం బ్యారేజీ లోకి మళ్లిస్తారన్నారు. గుంటూరు ఛానల్‌కు సాగునీటి సరఫరా కూడా ఇక్కడి నుంచే జరుగుతుందని అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్వహణ పనులు చేపట్టకుండా గాలికి వదిలేసిందన్నారు. 2019`4 మధ్య కరకట్ట విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ రెగ్యులేటర్ పునర్నిర్మాణం చేయవలసి ఉన్నప్పటికీ, ఆ పనిని గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. వారు చేసిన పాపాలను తాము ప్రక్షాళన చేసుకుంటూ వెళుతున్నామన్నారు. వైసీపీ హయాంలో అమరావతిపై అక్కసుతోనే.. కరకట్ట ప్రాజెక్టు ఆపేశారన్నారు. కొండవీటి వాగు వరదను ప్రస్తుతం 5`6 పంపుల ద్వారా రోజుకు 2000 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు. మరో 3000 క్యూసెక్కుల వరద వచ్చినా, అన్ని పంపులను నడిపి పూర్తిగా నియంత్రించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేశామన్నారు. ఎటువంటి ప్రమాదమూ లేదు.. ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పచ్చి అబద్ధాలన్నారు. ప్రజల్లో భయందోళనలు సృష్టించి అశాంతి వాతావరణం కల్పించడమే వారి ధ్యేయం అని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు.
తుంగభద్రకు ప్రమాదం లేదు
తుంగభద్ర ప్రాజెక్టు 3గేట్ల మార్పిడి పనులకు రూ.52 కోట్లు పరిపాలన అనుమతి ఇచ్చి టెండర్ల ద్వారా ఏజెన్సీకి పనులు అప్పగించచామన్నారు. అప్పటివరకు భద్రతా చర్యలలో భాగంగా, 80 టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. వర్షాకాలానికి ముందు సాధారణ పరిశీలనలో 7 గేట్ల ఆపరేషన్‌లో స్వల్ప ఇబ్బందులు గమనించి పటిష్ట ఏర్పాట్లు జరిగాయని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఆయకట్టు భూములకు నీటి సరఫరా విషయంలో ఖరీఫ్‌కు ఎటువంటి అంతరాయం ఉండదన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రమాదం వంటి వార్తలు పూర్తిగా నిరాధారమని ప్రజలను భయపెట్టేందుకు రాజకీయ లబ్ధితో చేస్తున్న కుతంత్రపు విమర్శలే తప్ప వాటిలో వాస్తవం లేదని మంత్రి నిమ్మల తెలిపారు.
మనుగడ ఉండదనే భయంతోనే..
ప్రకాశం బ్యారేజీ 67వ గేటు విరిగింది అనేది కూడా అబద్ధమేనన్నారు. గేటు సురక్షితంగానే ఉందన్నారు. గేటుకి సంబంధించిన రోలర్‌లో చిన్న సాంకేతిక సమస్య వల్ల గేటు ఆపరేషన్ నిలిపివేశామన్నారు. అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీస్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతుండడంతో భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమనే విషయం గ్రహించిన వైసీపీ నేతలు విషప్రచారానికి దిగుతున్నారని మంత్రి నిమ్మల అన్నారు.