- క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
- శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు
- తిరుపతిలో జోనల్‌స్థాయి పోటీల ప్రారంభం
తిరుపతి(చైతన్యరథం): గత ప్రభుత్వానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. ఈనెల 29న జరగనున్న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని తారక రామ స్టేడియంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహ యాదవ్, ఏపీజీబీసీ చైర్మన్ సుగుణమ్మ, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వ లన చేశారు. ఎనిమిది జిల్లాల నుంచి 1700 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఈనెల 29న నేషనల్ స్పోర్ట్స్ డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు స్పోర్ట్స్ డే వేడుకలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా నగదు ప్రోత్సాహకాలు, పతకా లు అందజేస్తామన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్మరించుకుంటూ క్రీడాకారులను గౌరవించాలనే ఉద్దేశంతోనే నేషనల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు నాగార్జున యూనివ ర్సిటీలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారుల జీవిత భద్రతకు రాత పరీక్ష లేకుండా 3 శాతం రిజర్వేషన్‌తో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. క్రీడాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి విశేషమైనదన్నారు. స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలకు రూ.30 వేలు నిధులను కేటాయించి క్రీడా సామగ్రిని అందజేస్తున్నారని వివరించారు. పాఠశాలల్లో క్రీడా స్థలాల అభివృద్ధికి పంచాయతీరాజ్ ద్వారా 10 శాతం నిధులను కేటాయిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా కృషి చేస్తున్నారని వివరిం చారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కృష్ణయ్య డ్రగ్స్ నిర్మూలనపై క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ రజనీ, డీఎస్డీఓలు శశిధర్, బాలాజీ, ఉదయ్, రాజు, జగన్, తదితరులు పాల్గొన్నారు.