- సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- వైద్య మంత్రి సత్యకుమార్ అదేశాలు
అమరావతి(చైతన్యరథం): భారీ వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలను త్వరితగతిన తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశిం చారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించిన ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల్లోని తాజా పరిస్థితులపై అధికారులు మంత్రికి సోమవారం వివరిం చారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలకుం డా ఉండేందుకు ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వచ్చేనెల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అంటు రోగాల నియంత్రణకు అవసరమై న చర్యలు తీసుకోవడంలో అలసత్వానికి తావివ్వొద్దని సూచిం చారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించిన సమ స్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మండలాల వారీగా కేసుల నమోదు తీరుపై సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నా రు. ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా చూసినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్నారు.
గ్రామాల్లో పని చేసే సీహెచ్‌ఓలు, జిల్లా అధికారులు నిర్దేశించిన సమయాల్లో తాగునీటి నమూనాలు, సేకరించి పరీక్షలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నీటి ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మున్సిపల్, పంచాయతీ, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ అవసర మైన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా వైద్యుల సూచించిన మేరకు ప్రసవ తేదీల ఆధారంగా గర్భిణుల వివరాలు సేకరించి వారికి వైద్యసేవలు సకాలంలో అందడంలో ఎటువంటి అవరోధం రాకుండా చూడాలని సూచించారు. ఇందుకు ఆశా, ఏఎన్‌ఎంల సహకారం తీసుకోవా లన్నారు. ఈ సందర్భంగా అధికారులు అవసరాలకు అనుగు ణంగా వాడుకునేందుకు అంబులెన్సులను మ్యాపింగ్ చేసినట్లు వెల్లడిరచారు.