- ఇదిగో జగన్‌రెడ్డి మీ తారుమారు లెక్కలు
- 2014 గ్రాంట్స్ కలిపి ఆదాయంగా చూపుతారా?
- గణాంకాలను తారుమారు చేసి తప్పుడు ప్రచారమా?
- బుగ్గనా..ప్రభుత్వంపై లేనిపోని దుష్ప్రచారం ఆపు
- బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ ఎన్.విజయ్‌కుమార్
మంగళగిరి(చైతన్యరథం): ‘కాగ్’ నివేదికలో అంకెలను కూడా వైసీపీ తారుమారు చేసి తిమ్మినిబమ్మి చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సాక్షి టీవీలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఆర్థిక సంవత్సరం గణాంకాలను రెండేళ్ల క్రితం అంకెలతో పోల్చి.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని, కేంద్రం నుంచి వచ్చిన రెవెన్యూ డెఫిసిట్‌ను కలిపి చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం విఫలం అంటూ మభ్యపె ట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఆదాయం మాకు రూ.58 వేల కోట్లు వచ్చాయి..మీకు రూ.49 కోట్లే అంటే మామూలు జనాలకు కూడా అర్థం కావాలి కదా.. ‘కాగ్’ నివేదిక లో జూన్ నెలకు ఇచ్చిన అంకెలను అటూ ఇటూ మార్చి ప్రజల ముందు పెట్టారు. ‘కాగ్’ ఆడిటింగ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీకృత సంస్థ. ప్రతి రాష్ట్రం, కేంద్రానికి సంబంధించి ప్రతినెలా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ స్పష్టమైన ఆర్థిక అంకెలను నివేదిక రూపంలో ఇస్తుంది. ఆడిటింగ్‌కు సంబంధించి అదే ఫైన ల్. అయితే జగన్‌రెడ్డి ఆ ‘కాగ్’ అంకెలకు కూడా తనదైన వక్ర భాష్యాన్ని చెబుతూ గత సంవత్సరం తక్కువ ఆదాయం అంటూ నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జీఎస్టీ మొదలుకుని అన్నింటినీ కూటమి ప్రభుత్వంలో తక్కువ అని చెప్పడానికి కుటిల రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు అదే నిజమని అనుకునే ప్రమా దం ఉందని..అందుకే వాస్తవాలు వివరిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రం గ్రాంట్స్‌ను కలిపేసుకుంటే ఆదాయం పెరిగినట్టా?
రాష్ట్ర సొంత ఆదాయం మూడు రకాలుగా ఉంది. రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్స్, రాష్ట్ర పన్నుల్లో కేంద్రం వాటా గా ఇచ్చేది. బుగ్గన కేంద్రం ఇచ్చే గ్రాంట్స్‌ను కూడా కలిపేసి మాట్లాడేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం నెలకోసారి లెక్కిస్తారు. 2023 జూలైలో వారికి రూ.58 వేల కోట్లు ఆదాయం వచ్చిందని బుగ్గన తప్పుడు లెక్కలు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత కూడా కూటమి ప్రభుత్వానికి 2025 జూలైలో రూ.49 వేల కోట్లే వచ్చిందని విమ ర్శలు చేస్తున్నారు. కేంద్రం ఒక్క పథకానికి ఇచ్చే గ్రాంట్స్ ఒకే నెల లో రావాలని రూల్ లేదు. ఏ నెలలో అయినా రావచ్చు. 2023 లో జూన్, జూలైలో రూ.15 నుంచి రూ.20 వేల కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో వచ్చాయి. 2014 రెవెన్యూ లోటు 2019 దాకా రాలేదు. అది కేంద్రం 2023లో విడుదల చేసింది. ఆ గ్రాంట్స్‌ను చూపించి మాకు ఎక్కువ ఆదాయం వచ్చిందని బుగ్గ న మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు బుగ్గన ఆచితూచీ మాట్లాడు తారని అనుకున్నా. కానీ తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా, మభ్యపెట్టేలా, ప్రభుత్వంపై విషప్రచారం చేస్తూ మోసం చేసేలా మాట్లాడుతున్నారని అర్థమైంది. 2023లో రూ. 38,079 కోట్లు ఉంటే 2025లో ఈ ఏడాది రూ.45 వేల కోట్లు వచ్చింది. అంటే రూ.7 వేల కోట్లు ఆదాయం వచ్చింది. 2014 లో రావాల్సిన గ్రాంట్స్‌ను 2023లో కలిపేసుకుని వచ్చిన ఆదా యం రూ.35 వేల కోట్లు. మొత్తం కలిపి రూ.58 వేల కోట్లు వచ్చి నట్టు తప్పుడు మాటలు చెబుతున్నారు. 2023 జూలైలో జీఎస్టీ రూ.14,905 కోట్లు, 2024 జూలైలో రూ.15,258, 2025లో జూలైలో రూ.16,574 కోట్లు వచ్చింది. రూ.2 వేల కోట్ల అదనం గా ఆదాయం వస్తే ఏదేదో చెప్పి కూటమి ప్రభుత్వంపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దని బుగ్గనకు హితవు పలికారు.
లిక్కర్‌లో వేల కోట్లు దోపిడీ చేశారు
ఈనాడు ఎప్పుడు తప్పుడు కథనాలు ప్రచురించదు. సాక్షిలో ప్రచురించేంది మాత్రమే తప్పుడు కథనాలు. స్ట్రాంప్స్ రిజిస్టేషన్ శాఖలో 2023 జూలైలో రూ.3200 కోట్లు ఆదాయం వచ్చింది. 2024లో రూ.2559 కోట్లు, 2025లో రూ.3587 కోట్లు వచ్చిం ది. ఎకానమి దూసుకుపోతుందని దీని అర్థం. సేల్స్ ట్యాక్స్ 2023 లో రూ.6300 కోట్లు వస్తే, 2025లో రూ.5875 కోట్లు ఆదా యం వచ్చింది. సేల్స్ ట్యాక్స్ మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఎక్సైజ్ శాఖలో 2023లో రూ.4900 కోట్లు, 2024లో రూ.5000 కోట్లు, 2025లో రూ.5681 కోట్లు ఆదాయం వచ్చిం ది. రూ.800 కోట్లు అదనంగా ఆదాయం కూటమి ప్రభుత్వానికి వచ్చింది. మద్యం ధరలు తగ్గించినా తాగేవాళ్లు ఎక్కువ ఏం కాలే దు. అదే సంఖ్యలో తాగుతున్నారు. అయినా మాకు రూ.800 కోట్లు ఆదాయం వచ్చింది. మీ హయాంలో లిక్కర్ సొమ్మంతా బయటినుంచి బయటికే తరలించారు. దాదాపు రూ.5,6 వేల కోట్లు దారిమళ్లించారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ధనుజయ్ రెడ్డి, బాలాజీలు కలసి బిగ్‌బాస్‌కు ఇస్తే ఎక్సైజ్ శాఖలో ఆదాయం ఎలా కనిపిస్తుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్‌తో హంద్రీనీవా పూర్తి చేశాం. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రూ.8500 కోట్లు పెట్టుబ డుల కింద ఖర్చు పెట్టామని వివరించారు.
కాంట్రాక్టర్లకు వేలకోట్లు దోచిపెట్టారు
వైసీపీ హయాంలో రూ.15,783 కోట్లు ఖర్చు చేశామని బుగన చెప్పుకొచ్చారు. 2023లో రూ.1,400 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతకు ఒక్క నెలల్లోనే రూ.15 వేల కోట్లు దారాదత్తం చేశారు. గుంటూరులో అంబటికి నిధులు కేటాయించారు. అలాగే ఆగస్టులో రూ.900 కోట్లు, సెప్టెంబరులో రూ.1300 కోట్లు ఇచ్చారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టి ఏం చేశారు. వైసీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. ఏంబీఏ చదివిన వ్యక్తిని ఆర్థిక శాఖ మంత్రిని చేశారు. ఏం చూసి బుగ్గనను మంత్రిగా చేశారో నాకు అర్థం కావడం లేదు. రెవెన్యూ లోటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అప్పులు రూ.45 వేల కోట్లు చేశామని బుగ్గన చెప్పా రు. రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేశాం. 2023లో మీరు 4 నెల ల్లో రూ.45 వేల కోట్లు అప్పు చేశారు. 2025లో 4 నెలల్లో రూ.48 వేల కోట్లు చేశాం. 3 వేల కోట్లు అదనంగా అప్పు చేశాం. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రూ.2684 కోట్ల తో మహిళలకు రాయితీపై ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం. ఆర్బీఐ లిమిట్స్‌తో అప్పు ఎక్కువ చేసుకునే వెసులుబాటు మాకు ఉన్నా తక్కువ అప్పే చేశాం. వైసీపీ హయాంలో పెట్టిన 3 నెలల బకాయిలు కూడా కట్టాం. రూ.10 వేల కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం.
అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3173 కోట్లు అందజేశాం. గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ఇచ్చాం. 16,437 డీఎస్సీ పోస్టులు భర్తీ చేశాం. వైసీపీ హయాంలో ఒక్క ఉపాధ్యాయుడి పోస్టు అయినా భర్తీ చేశారా? అర్చకుల వేతనం రూ.15 వేలకు పెంచాం. ఇమామ్, మౌజమ్‌లకు గౌవర వేతనం ఇస్తున్నాం. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలు, మత్సకారులకు రూ.250 కోట్లు సాయం చేశాం. ఇలా అనేకం చేశాం. మీరు వేల కోట్లు అప్పు లు చేసి ఏం చేశారు? ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక పరిశ్రమను తీసుకురాలేదు. వైసీపీ, సాక్షి పత్రికకు ఆర్థిక అంశాలపై అవగా హన లేదు. కాగ్ నివేదికను తారుమారు చేసి ఏదేదో మాట్లాడు తున్నారని ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే వీధుల్లోకి వచ్చి జనానికి సేవ చేసి మెప్పు పొంది ఓట్లు పొందాలి కానీ, ఇలా తప్పుడు విమర్శలు, తప్పుడు కథనాలతో కాదు..అలా చేస్తే ప్రజల్లో మీరు ఇంకా చులకన అవుతారు. వైసీపీ పాలన కంటే టీడీపీ పాలన చాలా బాగుందని ప్రజలే మెచ్చుకుంటున్నారని తెలిపారు.