- ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు
- బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ మంత్రి సవిత
- సోమందేపల్లి నుంచి భారీ ట్రాక్టర్ ర్యాలీ
- భారీగా తరలివచ్చిన రైతులు
పెనుకొండ(చైతన్యరథం): అన్నదాతల బాగు కోరుకునే ప్రభు త్వం కూటమి ప్రభుత్వమని, రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబు అని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మొద ట విడత నిధులు జమ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞ తలు తెలియజేస్తూ మంత్రి సవిత ఆధ్వర్యంలో రైతులు భారీ ట్రాక్ట ర్ల ర్యాలీ చేపట్టారు. సోమందేపల్లి నుంచి పెనుకొండ మార్కెట్ యార్డ్ వరకూ 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, కూటమి నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు. అనంతరం పెనుకొండ మార్కెట్ యార్డ్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను మంత్రి లోకేశ్ గాడినపెడుతున్నారు. ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ ప్రజలు పెట్టుకున్న నమ్మ కాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
అన్నం పెట్టే రైతన్న పెట్టుబడి కోసం ఎవ్వరిని చేయి చాపకూడదనే అన్నదాత సుఖీభవ పథకానికి చుట్టారు. ఏడాదికి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయా న్ని అందజేసేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌తో పాటు విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నా మన్నారు. వ్యవసాయంలో సాంకేతికతను జోడిస్తున్నామని, డ్రో న్స్, శాటిలైట్, సెన్సార్, డీప్‌టెక్ వినియోగిస్తున్నామని తెలిపారు. రైతులకు సబ్సిడీపై డ్రోన్లు, వంద శాతం సబ్సిడీపై స్ప్రింకర్లు అం దజేస్తున్నామని చెప్పారు. పొలం పిలిచింది కార్యక్రమంతో రాష్ట్రం లో సాగు పెంచేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకు న్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు అపర భగీరథుడని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు.