- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
- టీడీపీ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతి
మంగళగిరి(చైతన్యరథం): స్వాతంత్య్ర సమరయోధుడు, తెలు గు ప్రజల పోరాట యోధుడు గౌతు లచ్చన్న జయంతి వేడుకలు శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం లచ్చన్న జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన గౌతు లచ్చన్న నాడు ఈ దేశం కోసం పాలకులను ఎదు రించి భానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించాలని చేసిన పోరా టాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా స్వాతంత్య్రం అనంతరం వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కూడా జీవితాంతం పోరాడిన నాయకు డని గుర్తుచేశారు. ఆయన త్యాగస్ఫూర్తి, ప్రజాసంకల్పం నేటి తరాలకు ఆదర్శమని అన్నారు. గౌతు లచ్చన్న ఆశయాలు, ఆయన కలల సమాజం సాధనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పల్లా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవులు, కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి ఆశోక్ బాబు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, తాళ్ల వెంకటేష్ యాద వ్, పర్చూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.