- 116వ జయంతి సందర్భంగా నివాళి
రాజమండ్రి(చైతన్యరథం): గౌతు లచ్చన్న జయంతి సంద ర్భంగా రాజమండ్రి వై జంక్షన్‌లో ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీ న వర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న జయంతి వేడుకలను జీవో నెం.83 ద్వారా అధికారికంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారాలోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లచ్చన్న ఆశయాల సాధనకు కృషి చేస్తున్న గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘాలను అభినందించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి తను నమ్మిన సిద్దాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా బడు గులకు దిక్సూచిగా నిలిచిన గౌతు లచ్చన్న స్ఫూర్తిదాయ కమైన జీవిత చరిత్రను భావి తరాలకు తెలపాల్సిన అవసర ముందని అన్నారు. ఆయన జయంతిని ఏటా అధికారికంగా నిర్వహిం చాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమ న్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. గౌతు లచ్చన్న పేరు వింటేనే ఉద్యమానికి నిలువెత్తు రూపం. భారతదేశ రాజకీయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు పొందిన మహనీయులు గౌతు లచ్చన్న అని గుర్తుచేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నెగ్గారని, మంత్రిగా కూడా చేశారని వివరించారు. కల్లుగీత కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకు కృషి చేశారని పేర్కొన్నారు. 96 సంవత్సరాల తన జీవిత కాలంలో రాష్ట్ర ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశారని నాడు పలాసలో ఒక్కడే అఖిల భారత కిసాన్ సభను నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. మెట్రిక్యులేషన్ చదువుతున్న సమయంలో మహాత్మా గాంధీజీ పిలుపుమేరకు ఉద్యమంలోకి అడుగుపెట్టారని, అనేక పర్యాయాలు ప్రజల కోసం జైలుకు వెళ్లారని వివరించారు.