చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సర్దార్‌ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శం

జయంతి ఉత్సవాల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

by చైతన్యరధం
Aug 17, 2025 at 6:04am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
సర్దార్‌ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం
  • గీత కార్మికులకు ఉపాధి పెంచేలా నూతన ఉత్పత్తుల రూపకల్పన
  • ఆదరణ 3.0 పథకం ద్వారా మోపెడ్లు అందజేత
  • రంపచోడవరం హార్టీకల్చర్‌ పరిశోధనా కేంద్రంలో తాటి ఉత్పత్తుల తయారీ
  • జయంతి ఉత్సవాల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

విజయవాడ (చైతన్యరథం): బడుగు, బలహీన వర్గాల కోసం డాక్టర్‌ సర్దార్‌ గౌతు లచ్చన్న తన జీవితాంతం పాడుపడ్డారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్‌. సవిత అన్నారు. స్వాతంత్ర సమరయోధులు డాక్టర్‌ గౌతు లచ్చన్న 116వ రాష్ట్ర స్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముందుగా సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎస్‌.సవిత మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సర్దార్‌ గౌతు లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బడుగు వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. గౌతు లచ్చన్న పోరాట యోధుడే కాదు గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని, హరిజన, గిరిజన రక్షణ యాత్రలు నిర్వహించారన్నారు. గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.త్వరలోనే ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభించనున్నామని, ఈ పథకం ద్వారా గీత కార్మికులకు మోపెడ్‌ ద్విచక్ర వాహనాలు అందజేయబోతున్నామన్నారు. సర్దార్‌ గౌతు లచ్చన్న స్ఫూర్తితో బీసీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే బీసీలంతా ముఖ్యమంత్రికి అండగా నిలబడాలన్నారు. గీతకార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు అందజేయనున్నామన్నారు. రంపచోడవరంలో హార్టీకల్చర్‌ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారుచేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
బీసీలకు అండగా ప్రభుత్వం: మంత్రి అనగాని
రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే ఈ కార్యక్రమం అన్నారు. బిరుదులు అందరికీ ఇస్తారు.. కొందరు మాత్రమే స్వతహాగా సాధిస్తారన్నారు. లచ్చన్నకు అలా వచ్చిందే సర్దార్‌ అనే బిరుదు అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం, అంటరానితనం పై పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్‌ సర్దార్‌ గౌతు లచ్చన్న అని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఏవిధంగా అండగా ఉంటున్నదో ప్రజలు చూడాలన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయించడం అభినంధనీయమన్నారు. బీసీ వర్గాల పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.
చిరస్మరణీయుడు: పల్లా
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడిన వ్యక్తులను ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అలా గుర్తుండిపోయే నాయకులు గౌతు లచ్చన్న అని, ఆయన ఆశయాలను ఇకముందూ కొనసాగిస్తామన్నారు. లచ్చన్న మార్గంలోనే అణగారిన వర్గాల అభ్యున్నతికి టీడీపీ తొలినుండీ కృషి చేస్తోందన్నారు.
పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య ఎన్‌.జీ. రంగాను పార్లమెంటు సభ్యునిగా శ్రీకాకుళంలో నిలబెట్టి గెలిపించిన వ్యక్తి లచ్చన్న అని తెలిపారు. గౌతు లచ్చన్న అడుగుజాడల్లో నడుస్తూ ముందు తరాలకు ఆయన స్ఫూర్తి అందిస్తామన్నారు.
ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ బీసీలకు రాజకీయ గుర్తింపు కావాలని కోరుకున్న వ్యక్తి డాక్టర్‌ సర్దార్‌ గౌతు లచ్చన్నఅన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మా గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఆయన జీవితం ఎంతోమంది మాలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు..
గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ప్రజా పోరాటాలు చేసిన నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చిన్నప్పుడు తాను తాత దగ్గర పెరగడం వల్ల.. ఆయన ఆశయాలు, ఆలోచనలు తనపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు. విలువలతో, నిజాయితీతో పని చేసిన గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గౌతు లచ్చన్నను గౌరవించకపోగా మా కుటుంబాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. గౌతు కుటుంబానికి రాజకీయ వారసురాలుగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తాత, తండ్రి నేర్పిన విలువలతోనే రాజకీయం చేస్తానన్నారు…
కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్‌, పితాని సత్యన్నారాయణ, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, వర్ల కుమార్‌ రాజా, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరంకి గురుమూర్తి సహా పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు, అధిక సంఖ్యలో గీత కార్మికులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

అండగా నిలబడతాం

Previous Post

ఉద్యమాల నిప్పుకణిక సర్దార్‌ గౌతు లచ్చన్న

Next Post

మహిళా సాధికారతను చాటుదాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

కార్యకర్త
@ June 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

కార్యకర్త
@ June 10, 2026
అండగా నిలబడతాం
ఆంధ్రప్రదేశ్

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్
ఆంధ్రప్రదేశ్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు
ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు

చైతన్యరధం
@ June 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026

కార్యకర్త
@ June 9, 2026
Load More

ముఖ్య వార్తలు

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
2027 నాటికి భూ రికార్డులు క్లీన్

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

చైతన్యరధం
@ June 9, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అండగా నిలబడతాం

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist