- బాలబాలికలకు పౌష్టికాహారం అందించాలి
- గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సంధ్యారాణి
పాలకొల్లు(చైతన్యరథం): ప్రతి గిరిజన కుటుంబానికి పథకాలు సమర్థవంతంగా చేరుతున్నాయా లేదో నివేదిక ఇవ్వాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా 1626 అంగ న్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లలకు అందుతున్న పోషకాహా రం, విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలబాలికల కు అందాల్సిన సౌకర్యాలు తప్పనిసరిగా అందించాలనే దానిపై ప్రత్యే క దృష్టి సారించాలని సూచించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా గిరిజ న కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందు తున్నారా లేదా అన్న అంశంపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రతి గిరిజన కుటుంబానికి ఆధార్ నమోదు పూర్తిగా జరిగిందా?
పెన్షన్, విద్యా వేతనాలు, గృహ నిర్మాణ పథకాలు, ఆరోగ్య బీమా, ఆర్థిక సహాయ పథకాలు వంటి అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరుతున్నాయా అనే విషయాలను అధికారులు పరిశీలించి వెంటనే నివేదిక అందించాలని ఆదేశించా రు. గ్రామస్థాయి వరకు పథకాల అమలులో పారదర్శకత, వేగ వంతం అవసరమని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా, అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గిరిజనుల సంక్షేమం, స్త్రీలు, పిల్లల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టు బడి ఉంది. ఈ వర్గాల అభివృద్ధి కోసం ఏ సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చి మగోదావరి జిల్లాలో గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి తీసుకుంటున్న కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలు చేయాలని సూచించారు.