అమరావతి(చైతన్యరథం): సచివాలయంలోని 5వ బ్లాక్ ఆర్ అండ్‌బీ కార్యాలయంలో బుధవారం రోడ్లు భవనాలు, పెట్టుబ డులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ సుపరిపాలన, ఏడాది కాలంలో రాష్ట్రానికి పెద్దఎత్తున వస్తున్న పెట్టుబడులుపై చర్చించారు.