అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో నలు గురు అదనపు న్యాయమూర్తులు బుధవారం ప్రమాణం చేశారు. హైకోర్టులో ఇప్పటివరకూ అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తు న్న జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ (కిరణ్మ యి కనపర్తి), జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజ య్‌లను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశా లు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం స్వీకా రం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తు లు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.