జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విరుద్ధంగా ప్రవర్తించారు
వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు
వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
అమరావతి(చైతన్యరథం): ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై బెదిరిం పులు, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏపీఈ డబ్ల్యూఐడీసీ చైర్మన్ కుప్పం రాజశేఖర్ తదితరులు ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. అనం తరం మీడియాతో వర్ల రామయ్య మాట్లాడుతూ ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్న పోలీ సులపై వైసీపీ నేతలు అభాండాలు వేస్తున్నారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా ప్రత్య ర్థులకు అవకాశం ఇవ్వని సంఘటనలు జగన్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. నామినేషన్లు చించివేసిన సంఘటనను జగన్‌రెడ్డి మర్చి పోవడం మంచిది కాదు. నామినేషన్ వేస్తారేమోనని అభ్యర్థుల ఇళ్లలో సారా సీసాలు పెట్టి అక్రమ అరెస్టులు చేయించిన విషయం మరిచిపోతే ఎలా? గత మూడు దశాబ్దాలుగా ఓటుహక్కు వినియో గించుకోని పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు ఈ రోజు స్వేచ్ఛగా, ధైర్యంగా ఓటేయడం చంద్రబాబు ప్రజాస్వామ్య పాలనకు నిదర్శ నం. గతంలోలా రిగ్గింగ్‌లు, బూత్ స్వాధీనం చేసుకోవడాలు, దొంగ ఓట్లు వేయడాలు లేవు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరిగితే దాన్ని తప్పుబట్టడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. పోలీసు అధికారులను వ్యక్తిగతంగా దూషించడం తగదు. ఆ పోలీస్ అధికారిని కోస్తే కడపకు సరిపోతాడని కించప రచడం చట్టరీత్యా నేరం. పోలీసులు చట్టబద్ధంగా అరెస్టు చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి, పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవడం కూడా నేరమే. అతని ముఠాపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు.
జగన్ పాలన.. రాక్షస పాలనకు నిర్వచనం
పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ14 ఏళ్లకు పైగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబుపై జగరెరెడ్డి దుర్భాషలాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 31 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మీరే అసలైన డెకాయిట్స్. వృద్ధులకు రూ.3 వేల హామీ ఇచ్చి అమలు చేయలేదు. చంద్రబాబు రూ.4 వేల పెన్షన్ అందిస్తున్నా రు. అమ్మఒడి పేరుతో మోసం చేసిన మీరు, 67 లక్షల విద్యార్థులకు సాయం చేసిన ‘తల్లికి వందనం’ పథకాన్ని విమర్శించడం హాస్యాస్పదం. మూడు రాజధానుల పేరిట రాజధా నిని నాశనం చేసి, అమరావతిని అభివృద్ధి చేస్తున్న నాయకుడిని తప్పుబట్టడం విచిత్రం. పోలవరం 72 శాతం పూర్తి అయినా వెనక్కి నెట్టారు. 2027లో పూర్తి చేయాలని చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 500కి పైగా గ్రామాలకు నీళ్లు అందించే పనిని రాక్షస పాలన అంటారా? బీసీలపై దాడులు చేసిన మీ పాలనకు విరుద్ధంగా, వారికి పదవులు, సంక్షేమం కల్పిస్తున్న చంద్రబాబుపై విమర్శలు మీకు తగవని హితవుపలి కారు. ఎన్నికల ముందు తప్పుడు, మార్ఫింగ్ ఫొటోలు చూపడం అసత్య ప్రచారం చేశారు. మార్ఫింగ్ వెనకున్న నిజానిజాలను త్వరలో బయట పెడతామని హెచ్చరించారు.
అసెంబ్లీకి వెళ్లాలంటే జగన్‌కు భయం
దేవినేని ఉమా మాట్లాడుతూ ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ జెడ్పీటీసీ ఎన్నికల ప్రాంతంలో ప్రచారం నిర్వహించి వచ్చారు. అక్కడి ప్రజలు మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేయడానికి అవకాశం దొరికిందని ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. గత 30 ఏళ్లు తండ్రికొడుకుల పరిపాలనలో పులివెందుల, కడప జిల్లాల్లో ప్రజాస్వామ్యం నశించిందని మేము ఎన్నో సార్లు చెప్పాం. అయినా జగన్‌రెడ్డి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. 2020 ఎంపీటీసీ ఎన్నికల్లో 9,696 స్థానాల్లో 2,362 ఏకగ్రీవం చేయగా, జెడ్పీటీసీ 652 స్థానాల్లో 126 స్థానాలకు నామినేషన్లు పడకుండా చేశారు. ఈసారి 11 నామినేషన్లు వచ్చి, రెండు స్థానాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. రక్తపాతం లేకుండా ఎన్నికలు జరిగాక, రీ పోలింగ్ కోసం అభ్యర్థులను తాడేపల్లి ప్యాలెస్‌కి తీసుకెళ్లడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇప్పుడు డీఐజి కోయ ప్రవీణ్ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించగా, ఆయనపై జగన్ విమర్శలు తగదు. పోలీసులపై చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ వెంటనే కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. పులివెందుల ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పించుకుని పార్టీ కార్యాలయంలో కూర్చోవడం చట్టవిరుద్ధమన్నారు. పులివెందుల, కడప ప్రజలు టీడీపీ అభ్యర్థులను రెండు జెడ్పీటీసీ స్థానాల్లో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
జగన్ మానసిక స్థితి బాగోలేదు
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ జగన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన పూర్తిగా ఉన్మాద స్థాయికి చేరింది. ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేయడం, ఎవరినీ పట్టించుకోకపోవడం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అధికారం లో లేని సమయంలో కూడా అదే అహంకారంతో అధికారులను దూషించడం, ముఖ్య మంత్రిని అవమానించడం ఆయన మానసిక స్థితి ఎంత దిగజారిందో చూపిస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తే తన ఇష్టం వచ్చినట్లు హింసాత్మక చర్యలకు కూడా వెనుకాడరని, ఆయన మాటలే సూచిస్తున్నాయి. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ పార్టీకి ఉన్న గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని, వైసీపీని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా బహిష్కరించాలని అన్నారు. ఈసీని కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోడూరు అఖిల్ తదితరులు కూడా ఉన్నారు.