అమరావతి (చైతన్య రథం): నామినేటెడ్ పదవులు రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అందరికీ న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌కు విచ్చేసిన మంత్రి లోకేష్.. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పులివెందులలో 45 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచిందని.. దీన్ని చూసి వైకాపా ఓర్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరతామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి లోకేష్ ధైర్యం చెప్పారు.