రూ.32 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నౌపడను మోడల్ కాలనీగా తీర్చదిద్దుతామని వెల్లడి
పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశం
శ్రీకాకుళం/టెక్కలి(చైతన్యరథం): జిల్లాలో నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టు నిర్వాసితులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన పునరావాస కాలనీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం నౌపడ వద్ద నిర్మించనున్న ఆర్‌ఆర్ కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కాలనీలో రహదారులు, డ్రైనేజీ లు, పాఠశాలలు, ఆలయాలు, విద్యుత్, అంగన్‌వాడీ కేంద్రాలు, వంటి మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.32 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. పోర్టు కోసం భూములిచ్చిన మూలపేట, విష్టుచక్రపురం గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని ఆర్ ఆర్ కాలనీలో మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అం దుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి నిర్వాసిత కుటుంబా లకు మెరుగైన జీవన స్థితి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం.సురేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎస్.రామకృష్ణ, విద్యుత్ డీఈ నరసింహ కుమార్, ఏఈ సిహెచ్.కృష్ణమూర్తి, ఏఈ డి.శశిభూషణ్‌రావు, హేమసుందర్, ఎంపీడీవో జయంత్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.