ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
గీత కులాల ఆధ్వర్యంలో కృతజ్ఞతా ర్యాలీ
మచిలీపట్నం(చైతన్యరథం): బడుగు బలహీన వర్గాలకు రాజ కీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా తోడ్పాటు అందించే ఘన త కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గీత కులాలకు మద్యం షాపుల్లో 10 శాతం షాపులు కేటాయించ డమే కాకుండా లైసెన్సు ఫీజులో కూడా 50 శాతం సబ్సిడీ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో బార్‌లలో కూడా 10 శాతం గీత కులాలకు కల్పిస్తున్నట్లు తెలి పారు. మచిలీపట్నంలో ఆదివారం గీత కార్మికుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో పాల్గొన్నారు.
బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి రుద్రవరం వరకు గీత కార్మికులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. రుద్ర వరంలో తాటి చెట్లకు గీత కార్మికులు పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంఫీుభావంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్మికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే బీసీల జీవితాల్లో వెలుగు లు సాకారమయ్యాయన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా బీసీలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నిలిచారని పేర్కొన్నారు.
వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు తెలుగుదే శం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు మద్యం షాపుల్లో 10 శాతం షాపులను లైసెన్సు ఫీజులో 50 శాతం రాయితీతో కేటాయించడం సాహ సోపేతమైన నిర్ణయం అన్నారు. ఈ నిర్ణయంతో రూ.110 కోట్ల వరకు గీత కులాల వారికి మేలు చేశామన్నారు. త్వరలోనే ప్రకటించనున్న బార్ పాలసీలో కూడా గీత కులాల వారికి 10 శాతం బార్లను కేటాయించామని తెలిపారు. గతంలో చెట్టుపై నుంచి పడి చనిపోయిన వారికి జీవిత బీమా, గాయాలపాలైన వారికి ఆర్ధిక సాయం, దివ్యాంగులైన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాం. కల్లుగీత వృత్తిని కాపాడుకునేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. నీరా పరిశ్రమ ఏర్పాటుపై అధ్యయ నం చేస్తున్నాం. త్వరలోనే నీరాపై నిర్ణయం తీసుకుంటాం. ప్రభు త్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్క కార్యకర్తపైనా ఉందన్నారు. బీసీలందరికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.