అమరావతి (చైతన్యరథం): సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకోవటం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. రజనీ యుగంలో ప్రేక్షకులుగా జీవించి ఉండటం తమ అదృష్టం అన్నారు. అంతే కాకుండా కష్ట సమయంలో తమ కుటుంబానికి రజనీ ఇచ్చిన అచంచల మద్దతును తాము ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఆయన తాజా సినిమా కూలీ గొప్ప విజయం సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.