- ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేష్
- భాగస్వామ్యం కానున్న 250కు పైగా పరిశ్రమల ప్రతినిధులు
అమరావతి (చైతన్యరథం): గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారేందుకు రాష్ట్రం శరవేగంగా అడుగు లు వేస్తోంది. ఈ మేరకు బుధవారం విజయవాడ నోవాటెల్ హెూటల్లో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ను చేపడుతోంది. దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ను శక్తివంతం చేయడం తో పాటు.. సౌర, పవన శక్తికి నైపుణ్య హట్గా ఏపీ.. అనే నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొ రేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య
అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్య క్రమానికి 250కి పైగా పరిశ్రమల ప్రతి నిధులు, ముఖ్యమైన అభివృద్ధి భాగస్వా ములు హాజరుకానున్నారు. భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించేందుకు వేగం గా అడుగులు వేస్తుండగా.. ఈ గ్రీన్ వర్ఫోర్స్ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారనుంది. భారతదేశం లోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం ద్వారా గ్లోబల్ క్లీన్ఎనర్జీ ఆర్థిక వ్యవస్థకు మానవ వనరుల కేంద్రం గా ఆంధ్రప్రదేశ్ ఎదగనుంది.
వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో నైపుణ్య శిక్షణ
పునరుత్పాదక ఇంధన నైపుణ్య అభి వృద్ధి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తయారీ నుంచి ఇన్ఫ్ల లేషన్,ఆపరేషన్స్,నిర్వహణవరకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దీనిని కేవలం నైపుణ్య శిక్షణ కార్యక్రమంగా మాత్రమే మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ, వాతా వరణ మార్పులకు తగ్గ నైపుణ్యాల అభి వృద్ధికి, పరిశ్రమల వృద్ధికి దోహదపడే విధంగా రూపొందించారు. 2030కి 160 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని కార్యాచరణ రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో మాత్రమే కాకుండా గ్లోబల్టాలెంట్ ఎగు మతిదారుగా కూడా నిలవనుంది. ఈ సమావేశంలో మూడు హై-ఇంపాక్ట్ ప్యా నెల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు. సోలార్, విండ్ పరిశ్రమల దిగ్గజాలు.. పాలసీ మేకర్లు, శిక్షణ సంస్థలతో కలిసి డిమాండ్ ఆధారిత, పరిశ్రమల అవసరా లకు తగ్గ వర్క్ ఫోర్స్ అభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు. అదనం గా ప్రైవేట్ సెక్టార్ గ్రీన్ స్కిల్లింగ్ టాస్క్ ఫోర్స్ను కూడా ప్రారంభించనున్నారు.