అమరావతి (చైతన్య రథం): తెలుగు సినీ హీరో, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు 2023 సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘ఎంతో ప్రేక్షకాదరణ పొందిన చిత్రానికి అవార్డులు దక్కడం గొప్ప విషయం. బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
సంతోషంగా ఉంది..
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలా మామయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరిని జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘బాలా మామయ్య నటన, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలా మామయ్యకు, డైరెక్టర్ అనిల్ రావిపూడికి, చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.