- పలు అంశాలపై అధ్యయనం
- వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశీలన
- రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులతో సమీక్ష
సింగపూర్: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్ తరహా స్మార్ట్ సిటీగా అమ రావతి నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. దీని కోసం సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలను అమరావతి కోసం ఉపయోగించుకునే ఆలోచనలో ఉంది. అమరా వతి నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న మంత్రి రాజధానిని ప్రపం చంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేలా సింగపూర్‌లోని బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అధ్యయనం చేస్తున్నారు. గురువారం సింగపూర్‌లో పలు ప్రాంతాల్లో సీఆర్డీయే కమిషనర్ కన్నబాబుతో కలిసి అధ్యయ నం చేశారు. ఉదయం వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేశారు. సింగపూర్‌లో ఘన వ్యర్ధాల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అక్కడి అధికారులు మంత్రికి వివరించారు. చెత్త తరలింపునకు వినియోగిస్తున్న వాహనాలను పరిశీలించారు. ఆధునిక టెక్నాలజీతో చెత్తను సేకరించి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ల కు తరలిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆ తర్వాత సింగపూర్
ట్రాన్స్‌పోర్ట్ అధికారులతో సమావేశం
ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యా రు. సింగపూర్‌లో ఉపరితల రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన, రోడ్ల నిర్మాణం వంటివి ఈ అథారిటీ పర్యవేక్షణలో ఉంటా యి. ప్రజా రవాణా వ్యవస్థ, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం కూడా ఈ అథారిటీ పరిధిలోనే ఉంటాయి. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న రవాణా వ్యవస్థ గురించి అక్కడి అధికారులు వివరించారు. అమరావతిలో కూడా సింగపూర్ తరహాలో రోడ్ల నిర్మాణం, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు నిర్మించనుంది. ఆయా నిర్మా ణాలకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం సింగపూర్ అర్బన్ రీ డెవలప్‌మెంట్ అధారిటీ కార్యాల యంలో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్ అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ అథారిటీ కీలక నిర్ణ యాలు తీసుకుంటుంది. సింగపూర్‌లో భవన ప్రభుత్వ భవన నిర్మాణాలు డిజైన్లు రూపొందించడం, భూములపై పర్యవేక్షణ ఈ అథారిటీకి ఉంటుంది. రాబోయే 15 ఏళ్లకు సింగపూర్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసింది. మధ్యాహ్నం సింగపూర్‌లో జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ హబ్‌ను సందర్శించారు. లైవ్ చికెన్‌తో పాటు చికెన్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, డెలివరీ చేస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.
చికెన్ వ్యర్థాలతో కూడా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న యూనిట్‌ను పరిశీలించారు. రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అనంతరం సింగపూర్‌లోని గార్డెన్స్ బైది బేను సందర్శించారు. సింగపూర్‌లో ఉన్న అతిపెద్ద వర్టికల్ గార్డెన్ ఇది. ప్రపంచవ్యవాప్తంగా ఉన్న అనేక రకాల మొక్క లతో ఈ గార్డెన్ ఉంటుంది. ఇది క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్‌లతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా సింగపూర్‌కే తలమా నికంగా ఉంటుంది. అమరావతిలో బ్యూటిఫికేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సింగపూర్ వర్టికల్ గార్డెన్‌ను కూడా పరిగణ నలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు. శుక్రవా రం కూడా సింగపూర్‌లోనే ఆయన పర్యటించనున్నారు. రాత్రికి సింగపూర్ నుంచి మలేషియా వెళ్లనున్నారు.