- చెప్పింది చేస్తున్నాం, చేసేదే చెబుతున్నాం
- సమాజ హితమే ప్రభుత్వ ధ్యేయం
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
తిరుపతి(చైతన్యరథం): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం ప్రగతి పథం వైపు దూసుకువెళుతోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ సుగుణమ్మ తో కలసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరిం చడంతో పాటు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది.. చేసిందే చెబుతోంది. కక్ష సాధింపులకు తమ ప్రభు త్వం దూరం.. సమాజ హితమే మా ధ్యేయం..శాంతిభద్రతల స్థాపనే ముఖ్యం అని స్పష్టం చేశారు. తలరాతలు మార్చేవాడు చంద్రబాబు అయితే, ప్రజల తలకాయలతో ఆడుకునేవాడు జగన్‌రెడ్డి అని విమర్శించారు. వైసీపీ నేతలు తమ కక్ష్యలు, పగ లు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికి మరలా అధికా రంలోకి రావాలనుకుంటున్నారు తప్ప ప్రజా సేవ చేయటానికి కాదన్నారు. ప్రజలు వారి వైఖరిని గమనిస్తున్నారన్నారు.
టీడీపీతోనే సీమలో ప్రాజెక్టులు
రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్, చంద్రబాబే. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. హంద్రీ నీవాకు చివరిన ఉన్న అడివిపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకొస్తామని స్పష్టం చేశారు. నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కళ్యాణి డ్యామ్ నింపి తిరుపతికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. తిరుపతి పట్టణంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేలా కండలేరు రిజర్వా యర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌కు తరలిస్తామని హామీ ఇచ్చారు. జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నా డు. ప్రజారోగ్యంతో, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. నాడు కల్తీ మద్యం తాగి వందల మంది అనారోగ్యం పాలవడా నికి, ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమయ్యారని విమర్శిం చారు. కూటమి ప్రభుత్వం కక్షలు, కార్పన్యాలకు దూరమన్నా రు. అయితే తప్పులు చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలి గించాలని చూసినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.