- అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
- వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష
- రైతుబజార్లలో సదుపాయాలకు సూచనలు
మచిలీపట్నం(చైతన్యరథం): పీ4 కార్యక్రమం అమలులో కృష్ణా జిల్లాను రోల్ మోడల్‌గా మార్చాలని, అధికారులు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, వినియోగదా రులకు నాణ్యమైన కూరగాయలు అందేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని రైతుబజార్లలో సదుపాయాలు మెరుగు పరచాలని సూచించారు. రైతు బజార్లకు విస్తృతమైన ప్రచారం కల్పించాలని సూచించారు. మరోవైపు రోడ్లపై పశువుల సంచారా న్ని నివారించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరం మేరకు క్యాటిల్ షెడ్లకు పశువులను తరలించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రోడ్లపై తిరిగే పశువుల రైతులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ4 కార్యక్రమ ప్రత్యేక అధికారులు ఎంపీడీవో, మార్కెటింగ్ ఏడీతో చర్చించారు. పథకం అమలు, మార్గదర్శలు, బంగారు కుటుంబాల ఎంపిక గురించి అడిగి తెలుసుకున్నారు.