- చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
- జగన్ చేసిన అప్పులు తీరుస్తూనే.. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సీఎం చంద్రబాబు
- ఎన్డీయే కూటమి సుస్థిర కాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
- డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
అమలాపురం (చైతన్యరథం): ఏడాది పాలనలోనే ఎంతో చేశాం, చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పేరూరు, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గం మెండెపులంకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ నేత నామన రాంబాబు, కూటమి నేతలతో కలిసి మంత్రి స్వామి ఇంటింటికీ వెళ్లి ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని, అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో మంత్రి డా. స్వామి మాట్లాడుతూ…..ఏడాది పాలనలోనే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2014 -19 లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే 2019 ఎన్నికల్లో ఓడిపోయం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఈ నెలలో అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఒక పక్క జగన్ చేసిన అప్పులు తీరుస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
అమరావతి, పోలవరం పూర్తికి సీఎంచ ంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పీ 4 తో పేదరికం లేని సమాజమే ద్వేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిర కాలం అధికారంలో ఉండాలి. పరామర్శల పేరుతో జగన్ రెడ్డి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఎక్కడ శవం దొరికితే అక్కడ రాబందులా వాలి శవ రాజకీయాలు చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఆడబిడ్డలని అవమానపరిచిన వారిని దండిరచకుండా వారిని వెనకేసుకురావడంలోనే జగన్ రెడ్డి మనస్తత్వంం ఏంటనేది అర్థమవుతుంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రశాంతమైన కోనసీమలోకి రౌడీ సంస్కృతిని తీసుకువచ్చి అభివృద్ధిని అటకెక్కించారు. కోనసీమలో అభివృద్ధి అంతా టీడీపీ హయంలోనే జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలే కూటమిని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రి డా.స్వామి ఉద్ఘాటించారు.