- భక్తులకు పెద్దపీట వేసేలా ప్రణాళికలు
- సుజనా చొరవతో మారనున్న రూపురేఖలు
విజయవాడ(చైతన్యరథం): దుర్గమ్మ అనుగ్రహంతో విజయవా డ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన సుజనా చౌదరి పశ్చిమంలో సంక్షేమాన్ని అందిస్తూనే ఇంద్రకీలాద్రి అభివృద్ధికి నడుంబిగించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. భక్తుల భవిష్య త్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ నైపుణ్యం కలిగిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ వారిచే బృహ త్తర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు అభివృద్ధి, వాహనాల పార్కింగ్, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, విశ్రాం తి భవనాలను నిర్మించి ఆలయంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పచ్చదనంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రణాళికల ను సిద్ధం చేస్తున్నారు. రాబోయే 50 ఏళ్లను అంచనా వేస్తూ నిపు ణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ తన బృందంతో మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని ఇంద్రకీలాద్రి అభివృద్ధికి సుజనా అహర్నిశలు శ్రమిస్తున్నారు. దేవాదాయ మంత్రి ఆనం రామనారా యణరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దేవాదా య శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, నగర పోలీస్ కమిష నర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు సంబంధిత అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ అమలు కోసం సమీక్ష నిర్వహిస్తున్నారు.
కృష్ణా పుష్కరాల నాటికి ఆలయ తొలిదశ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా నిరంతరం కృషి చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్ల నిర్మాణం, వాహనాల పార్కింగ్, భక్తుల విశ్రాంతి భవనాల నిర్మాణం, ప్రసాదం పోటు, అన్నప్రసాద కేంద్రం, తాగు నీటి సౌకర్యాలను మెరుగు పరిచి కేశఖండన శాలలను నిర్మించి క్రౌడ్ మేనేజ్‌మెంట్ వంటి పలు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతూ ఆయన సలహాలు సూచనలను తీసుకుంటున్నారు. భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలను చేపడుతున్నారు. దసరా ఉత్సవాల సమయంలో అవు తున్న వృథా ఖర్చులను తగ్గించి ఇంద్రకీలాద్రిని శాశ్వత ప్రాతిప దికన అభివృద్ధి చేసి క్యూలైన్ల ఆధునీకరణ ద్వారా భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రసాద్ పథకం ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులను తీసు కువచ్చే ప్రయత్నం చేస్తూ అధికారుల, ప్రజాప్రతినిధుల సమన్వ యంతో ఏపీలోనే రెండవ అతిపెద్ద ఆలయమైన ఇంద్రకీలాద్రి రూపురేఖలు మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.