- యంత్ర పరికరాలతో రైతుకు మేలు
- స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
- ఆధునిక యంత్రాల ప్రదర్శన ప్రారంభం
నర్సీపట్నం(చైతన్యరథం): నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణ లో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనను స్పీకర్ చింత కాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్ చింతకా యల పద్మావతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భం గా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్‌ను స్వయంగా నడిపి దాని పనితీరు ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే లా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాదికి నర్సీ పట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తాము చూసిన యంత్రాల్లో అవసరమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చని, వీటిపై రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.2 లక్షలు చెల్లిస్తే రూ.10 లక్షల విలువ చేసే పురుగు మందు స్ప్రే డ్రోన్లు మండ లానికి రెండు చొప్పున ఆసక్తిగల రైతులు వీటిని తీసుకుంటే ఉపాధితో పాటు సాగులో కూడా ఆధునికీకరణ సాధ్యమవుతుంద ని అన్నారు. ఈ యంత్రాల వల్ల కూలీల కొరత అధిగమించవచ్చని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తవడం వల్ల సమ యంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు.
యువ రైతుకు అభినందన
ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన 348 మంది లో కేవలం 70 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పూర్వం మాదిరిగానే గౌరవ పూర్వ కంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అరటి పళ్ళు మగ్గే విధంగా ప్రత్యేక స్టోరేజ్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా గైరంపేటకు చెందిన యువకుడు శివ గణేష్ ఐదెకరా లలో అరటి, పామాయిల్ తోటను ఆదర్శంగా సాగుచేస్తుండడం తో ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు యంత్రాల కొనుగోలు కు అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు సహకరిస్తానని చెప్పారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు యంత్రాల పనితీరును ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా రైతులకు వివరిం చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకట రమణ, వైస్ చైర్మన్ కన్నయ్యనాయుడు, జెడ్పీటీసీ రమణమ్మ, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రాజన్న సూర్యచంద్ర, వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, శాస్త్రవేత్త జగన్నాధరావు, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దారు రామారావు తదితరులు పాల్గొన్నారు.