- ఏపీలోకి పెట్టుబడులు రాకుండా వైసీపీ దుర్గార్గం
- 200 కంపెనీలకు ఈ`మెయిళ్లపై సీఎ సీరియస్
- వైసీపీ బరితెగింపుపై మంత్రిమండలిలో చర్చ
- జరుగుతున్న బాగోతాన్ని సీఎం దృష్టికి తెచ్చిన పయ్యావుల
- కుట్రలపై విచారణ చేయిద్దామన్న సీఎం చంద్రబాబు
- బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం
- ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ మంత్రులకు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బ తీసేలా వివిధ కంపెనీలకు వైసీపీ ముఠా ఈ`మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులను అడ్డుకునేలా వైసీపీ చేస్తోన్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ.. పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థలకు మెయిల్స్ పెడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈ`మెయిళ్లు పెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతిపరులతో ఈ`మెయిళ్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు పయ్యావుల. తప్పులు చేసి.. ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టడమనే కుట్రలను వైసీపీ ఆదినుంచీ అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు రాకుండా తెరవెనుక అడ్డుకోవడం.. పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం.. ఆ పార్టీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ`మెయిళ్లు పెట్టడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పలువురు మంత్రులూ కోరారు. దీనికి స్పందించిన సీఎం.. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసేలా ఈ`మెయిళ్లు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదేవిధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందని సీపం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసింది వైసీపీ ముఠాలేనని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తు చేశారు.