- పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం..
- త్వరలో మార్గదర్శులతో భేటీ కానున్న సీఎం
- పీ-4జీరో పావర్టీపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు
అమరావతి (చైతన్య రథం): పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్- పార్టనర్ షిప్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో మార్గదర్శకులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. పీ4 `జీరో పావర్టీ కార్యక్రమంపై గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష జరిపారు. పీ`4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శులుగా ఉండేందుకు 18,332మంది ముందుకొచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, ఉన్నతవర్గాలవారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు.. మార్గదర్శిగా ఉండే వారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి స్వయంగా వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. మార్గదర్శులుగా ఉండే 200మంది టాప్ ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఎమ్‌ఎన్సీ కంపెనీల ప్రతినిధులు, సెలబ్రిటీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 18న అమరావతిలో వీరిని డిన్నర్‌కు ఆహ్వానించాలనే చర్చ ఈ సమీక్షలో జరిగింది. పీ`4 లక్ష్యాలను వివరించి మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు సిద్దంగావున్న అనేక వర్గాలవారిని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. కార్యక్రమంలో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.