- ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- మెగా పేరెంట్ మీటింగ్‌లో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చైతన్యరథం): ప్రజలు, ప్రభుత్వం కలిసి అడుగు వేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నా రు. నగరంలోని గోపు వెంకట నానారావు మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేసుకుని మంచి ఫలితాలని సాదిస్తున్నాం. ఎయిడెడ్ స్కూళ్లను ఆక్రమించుకోవడా నికి జగన్‌రెడ్డి ప్రయత్నించాడు. కూటమి వచ్చాక స్కూల్ ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. పిల్లలకు ఒత్తిడి లేని విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. స్థలం ఇవ్వ డంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆస్తులు దానం చేసి న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం అమలు చేశాం. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభు త్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో క్వాంటం కంప్యూ టింగ్ రంగంలో మన యువతకు ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర భోజనం చేశారు.
16న మెగా జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరణ
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 30 కంపెనీల ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ఈ నెల 13 నుంచి 15 వరకు నేషన ల్ కాలేజీలో శిక్షణ ఇవ్వనున్నాం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తు న్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి. అందరికీ సమయం కేటా యించి ఉద్యోగాలు కల్పించబోతున్నాం. మేఘా లాంటి పెద్ద కంపె నీలు సైతం రాబోతున్నాయి. ఆక్వా రంగంలో ఉన్న ప్రసిద్ధ కంపె నీలను కూడా జాబ్‌మేళాకు ఆహ్వానిస్తాం. ఇప్పటికే ర్యాంప్ కార్యక్ర మంలో 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిని పారిశ్రామి కంగా అభివృద్ధి సాధించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ, పీఎం విశ్వకర్మ లాంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. చిన్న యూనిట్ ఏర్పాటు చేసినప్పటికీ.. తర్వాత తర్వాత మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం సహకారం అంది స్తుందని తెలిపారు.