- పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపీ
- రప్పారెడ్డి కనుసన్నలలో హింసాత్మకం
- రాష్ట్ర ప్రజలు ఈ వైరుధ్యాన్ని గమనించాలి
- అధిక జనాభా అభివృద్ధికి అవరోధం కాదు
- వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
అమరావతి(చైతన్యరథం): ప్రపంచ ప్రఖ్యాత ‘‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)’’ రాష్ట్రం పెట్టుబడులకు, వ్యాపార నిర్వహణకు దేశంలో అత్యంత అనువైన నాలుగు రాష్ట్రా ల్లో ఒకటిగా నిలిచిందని నివేదిక ఇచ్చిందని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2025 సంవత్సరానికి ఈఐయూ బుధవారం విడుదల చేసిన నివేదికలో పెట్టుబడులను ఆకర్షించ డంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల తో పోటీ పడుతూ అత్యంత ఆకర్షణీయ రాష్ట్రంగా ఉందని వెల్ల డిరచింది. ఈ గణనీయ మార్పు ముఖ్యమంత్రి ‘బ్రాండ్’ విలువను మరోసారి నిరూపించిందని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలన పూర్తయిన తరుణంలో ఈ నివేదిక వెల్లడి కావడం…గత ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి అద్దం పడుతుందని వివరించారు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం పేరు చెబితే ఆసక్తి కలిగిన పెట్టుబడిదారులు, అప్పటికే రాష్ట్రంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు భయంతో పారిపోయారని, ఆ చీకటి రోజులకు భిన్నంగా కూటమి ప్రభు త్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ కృషి, దార్శనికతలతో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కేవలం మొదటి ఏడాదిలోనే ఆకర్షించడం విశేషమని పేర్కొన్నారు.
తోబుట్టువులపై నీచమైన ధోరణి
నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళా ఎమ్మెల్యేపై అదే జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన దారుణమైన వ్యాఖ్యలను జగన్‌రెడ్డి ఖండిరచకపోవడం వింతేమీ కాదని, మహిళలపై జగన్ రెడ్డికున్న సహజ వైఖరి అన్నారు. ఈ మహిళా వ్యతిరేక ధోరణిని ఆడపడుచులంతా గ్రహించాలని కోరారు. రాష్ట్ర వికాసానికి కంక ణబద్ధులైన ముఖ్యమంత్రి ప్రగతి యజ్ఞాన్ని నిర్వహిస్తుంటే దీనికి భిన్నంగా రప్పా…రప్పారెడ్డి అలియాస్ జగన్‌రెడ్డి తన విధ్వంసక యాగాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో బుధవారం జగన్‌రెడ్డి చేసిన చేసిన రప్పా విన్యా సాలు దీనికి తాజా ఉదాహరణ అని మంత్రి తెలిపారు. విధ్వంసం, వినాశాలకు రప్పారప్పా రెడ్డి అలియాస్ జగన్‌రెడ్డి నిలువెత్తు ప్రతీక అని ఆ దండుపాళ్యం ముఠా క్రీడలతో ప్రజలకు గుర్తు చేశారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న ప్రగతి యజ్ఞం, జగన్‌రెడ్డి వినాశకర పర్యటనలను విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనించాలని కోరారు.
అధిక జనాభా అనర్ధం కాదు
సరైన విధానాలతో విలువైన మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలని, అధిక జనాభా అనర్ధాలకు కారణమన్న అపోహ వీడాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారంనాడు జరుగనున్న ప్రపం చ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణలతో మానవ వనరుల సద్వినియోగంతో రాష్ట్రంలో ప్రగతికి కొత్త బాటలు వేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని మంత్రి గుర్తు చేశారు. రప్పారప్పా రెడ్డి పాలనలో గాడితప్పిన ఆరోగ్య రంగాన్ని తిరిగి పట్టాలెక్కించి ప్రజలకు నాణ్య మైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.