- ప్రతి పాఠశాలలో మౌలికవసతుల కల్పన
- విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
- పీటీఎం 2.0లో 452 సైకిళ్ల పంపిణీ
అద్దంకి(చైతన్యరథం): మెరుగైన విద్యావ్యవస్థ స్థాపనకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండ లంలోని మేదరమెట్ల జెడ్పీ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజర య్యారు. అద్దంకి నియోజకవర్గ విద్యార్థులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండో దశలో 452 సైకిళ్లను పంపిణీ చేశారు. అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ, సీఎస్‌ఆర్ నిధులతో వాటిని తయారు చేయిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా వ్యవస్థ బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. తల్లిదండ్రులుగా మీరు పడుతున్న కష్టం మీ పిల్లలకు ఉం డరాదనే కూటమి ప్రభుత్వ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొదటిసారి తల్లికి వందనం అందని వారికి ఎందుకు జమ కాలేదో తెలుసు కుని అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు కొరిశ పాడు జెడ్పీ పాఠశాలలో బాల బాలికలకు అదనపు వాష్ రూమ్ లు, రెస్ట్ రూమ్‌తో పాటు అదనపు వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పీటీఎం 2.0 సమావేశం అనంతరం మేదరమెట్ల, సోమవరప్పాడు ఎస్సీ కాలనీలో 25 కుటుంబాలకు శాశ్వత భూ హక్కు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.