- 30 ఎకరాల్లో అత్యాధునిక ప్రాజెక్ట్ అభివృద్ధి
- రూ.1500 కోట్ల పెట్టుబడి, 25 వేల ఉద్యోగాలు
- సంస్థ ఎండీతో ఫలించిన మంత్రి లోకేష్ చర్చలు
- అంతకుముందే జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థతో ఎంఓయూ
- విశాఖ వచ్చేందుకు ఒకే రోజు రెండు దిగ్గజ కంపెనీల సంసిద్ధత
- మంత్రి లోకేష్ బెంగళూరు పర్యటన సూపర్ సక్సెస్
బెంగళూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ జరిపిన బెంగళూరు పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వా గ్రూపు ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపిన కొద్ది గంటల్లోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. సత్వా గ్రూపు ఆధ్వర్యాన విశాఖ నగరంలో 30ఎకరాల విస్తీర్ణంలో సత్వా వాంటేజ్ మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ క్యాంపస్‌ను రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా ప్రత్యక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అదే విధంగా మంత్రి లోకేష్ బెంగుళూరు పర్యటనలోనే ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థ విశాఖలో 10వేల ఉద్యోగాలు కల్పించే జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ చర్చల ద్వారా ఒకేరోజు విశాఖపట్నంలో 35వేల మందికి ఉద్యోగాలు కల్పించే రెండు భారీ ప్రాజెక్టులను రప్పించి రికార్డు సృష్టించారు.
రూ.1,500 కోట్ల ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో సత్వా గ్రూప్ విశాఖలో అభివృద్ధి చేసే ప్రాజెక్ట్.. గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాలు, ప్రీమియం నివాస వసతులు, ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కలిగి ఉంటుంది. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. నివాస అపార్ట్‌మెంట్లతో పాటు, అత్యాధునిక వసతులతో కార్యాలయ భవనాలు, రిటైల్ అవుట్‌లెట్లు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు ఉంటాయి. ఈ క్యాంపస్ అందుబాటులోకి వస్తే, 25,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు, ఇది వైజాగ్ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా నిలుస్తుంది.
అంతకు ముందు బెంగళూరులో సత్వా గ్రూపు ఎండీ బిజయ్ అగర్వాల్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జీసీసీలను ఆకర్షించడానికి ప్లగ్ అండ్ ప్లే మోడల్, ప్రీ-బిల్డ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది, పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. మంత్రి లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సత్వా గ్రూప్ కొద్ది గంటల్లోనే విశాఖలో ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక క్యాంపస్ అభివృద్ధికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రెజెంటేషన్ తమకు ఎంతగానో ఆకట్టుకుందని ఆ ప్రకటనలో సత్వా గ్రూప్ తెలిపింది. మంత్రి లోకేష్ చురుకైన నాయకత్వం, పరిశ్రమలపై ఆయన దూరదృష్టి, మొక్కవోని నిబద్ధతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపింది. ఏపీలో అమలు చేస్తున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో అనుమతులు పెట్టుబడులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు.
1986లో ఏర్పాటైన సత్వ గ్రూప్.. రియల్ ఎస్టేట్ అభివృద్ధి, వాణిజ్య, నివాస, విద్య, డీ అండ్ బీ సొల్యూషన్స్, హాస్పిటాలిటీ, రిటైల్, కో-లివింగ్, కో-వర్కింగ్ అండ్ డేటా సెంటర్లతోపాటు జీసీసీ ఆర్గనైజేషన్ గ్రౌండిరగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, క్లయింట్ మేనేజ్‌మెంట్‌లో పేరొందింది. దేశవ్యాప్తంగా ఎన్నో అత్యాధునిక ప్రాజెక్టులను చేపట్టింది. బెంగళూరులో ఆకాశహర్మ్యాల నిర్మాణంలో, అంతర్జాతీయ స్థాయి కార్యాలయాలు, కమ్యూనిటీల అభివృద్ధితో ఈ సంస్థ పాత్ర ఎనలేనది. సత్వ గ్రూప్‌కు నేడు దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి ఐటీ పార్కులు, వాణిజ్య కేంద్రాలు, నివాస టౌన్‌షిప్‌లు, హాస్పిటాలిటీ, ప్రధాన నగరాల్లో రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయి. దేశంలోని పలు నగరాల్లో ఇప్పటివరకు 142 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసిన డైనమిక్ రియల్ ఎస్టేట్ సమ్మేళనం సత్వ గ్రూప్. 80మిలియన్ చదరపు అడుగులకు పైగా ప్రణాళికలు, అభివృద్ధి దశలో ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ రంగంలోనేగాక ఈ గ్రూప్ గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ చైన్ కలిగి ఉంది. సత్వా గ్రూపు విశాఖలో చేపట్టబోయే వాంటేజ్ ప్రాజెక్టులో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా గ్రేడ్ ` ఏ ఆఫీసులు, ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ అర్బన్ సదుపాయాలు ఏర్పాటుచేస్తారు. అధునాతన సాంకేతికతలతో దూసుకెళ్తున్న విశాఖ మహానగర అభివృద్ధిలో సత్వా క్వాంపస్ మైలురాయి కానుంది.