ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం కార్యాచరణ సిద్ధం చేసింది. సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట జూలై 2నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలు.. అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నెల ప్రణాళికను సీఎం చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఎన్నికల ముందు సూపర్ 6 మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ గురించీ ప్రతి గడపనా ప్రచారం చెయ్యాలని చంద్రబాబు ఆదేశించారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామంని, రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో పేరిట ఐదు వారాలపాటు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం చేపడుతున్నాడు జగన్‌రెడ్డి. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. ఐదేళ్లపాటు రాష్ట్ర విధ్వంసానికి పాల్పడిన జగన్‌రెడ్డే.. రాష్ట్రాన్ని వికాశంవైపు నడిపిస్తోన్న కూటమిని నిలదీస్తాననడం హాస్యాస్పదమే. -ఏపీని అన్ని రంగాలలో కటిక చీకట్లకు నెట్టిన చరిత్ర జగన్‌రెడ్డిది. అయినా తానేదో రాష్ట్రం కోసం జీవితాన్ని ధారపోశానన్న బిల్డప్‌తో.. నక్క వినయాలు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రజలకు మరోసారి మభ్యపెట్టాలని ప్రయత్నించడం జగన్‌కే చెల్లు!
శవాల గుట్టలమీదుగా, అబద్ధాల మెట్లమీదుగా మరోసారి సింహాసనం అధిష్టించాలని అర్రులు చాస్తున్నాడు జగన్. ఐదేళ్ల పాలనాకాలంలో జగన్ సాధించిన ఘనత ప్రజలకు తెలీదనుకోవడం అతని భ్రమ! విద్యుత్ ఛార్జీలతో నడ్డి విరిచాడు. నిత్యావసరాల ధరలు ఆకాశంలోవున్నా నిర్లక్ష్యం చూపాడు. చెత్త పన్నుతో వేధించాడు. ఆర్టీసీ ఛార్జీలను మూడుసార్లు పెంచి ప్రజలకు వాతలు పెట్టాడు. ఏటా ఆస్తిపన్నులు పెంచాడు. ఉచిత ఇసుక విధానం ఎత్తివేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టాడు. పేదలకిచ్చే కిలో కందిపప్పులో కోత పెట్టాడు. మద్యం ధరల్ని ఆకాశానికి చేర్చాడు. నాసిరకం మధ్యంతో ప్రజలు ప్రాణాలు తీశారు. ఇన్ని చేసిన జగన్.. ఇప్పుడు ఇంటింటికెళ్లి తాను చేసిన మేళ్లు చెబుతాననడం హాస్యాస్పందం. జగన్ సాగించిన దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండల గురించి ప్రజలకు ఏమని చెప్తాడు? ఐదేళ్లపాటు అరాచక పాలనతో రాష్ట్రం నడ్డి విరిచిన జగన్.. రాష్ట్రాన్ని ఉద్ధరించానని పచ్చి అబద్ధాలు చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ చేసిన అభివృద్ధిని చూసే రాష్ట్ర ప్రజలు 11సీట్ల ఫలితాలిచ్చారు. ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఏదోక దోపిడీకి గురయ్యారన్నది బహిరంగ వాస్తవం. ప్రజలకు సరైన ఆదాయం లేకుండా చేసి.. ప్రభుత్వం భిక్షమెప్పుడు వేస్తుందా? అన్నంత భయానక పరిస్థితికి తెచ్చిందే జగన్. వివిధ వర్గాల ప్రజలపై పన్నులు, ఛార్జీల రూపంలో వేసిన భారంతోపాటు, రేషన్ కోతల ద్వారా వినియోగదారులపై పడిన భారం కలిపితే రూ.1.5 లక్షల కోట్లు. అందులో అధికశాతం బాధితులు నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలే. ఎస్సీ,
ఎస్టీ, బీసీ, మైనార్జీలే.
2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో కూటమి శ్రేణులు నెలపాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్న విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రధానంగా పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత విసుక విధానం, తల్లికి వందనం అమలు చేశారు. అన్నదాతా సుఖీభవ ప్రణాళిక సిద్ధం చేశారు. దీపం-2 కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మైదాన, గిరిజన ప్రాంతాల్లో బీటీ, సీసీ రహదారులు, గోశాలల నిర్మాణం, గిరిశిఖర గ్రామాల్లో కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటువంటి విషయాలన్నింటినీ కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను సమర్ధ నాయకత్వమే అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలపనుంది. పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లోనూ నిర్దుష్ట లక్ష్యాలు నిర్దేశించుకొని.. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేస్తోంది కూటమి సర్కారు. అలాంటి కూటమిపై బురదచల్లి బదనాం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వస్తున్న కుట్రదారుడి బండారాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే బయటపెట్టాల. అసమర్థుడే పాలకుడైతే.. గత ప్రభుత్వకాలంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి..
రాష్ట్రానికి ఎంతటి నష్టం వాటిల్లింధో ప్రజలకు వివరించాలి. పార్టీ యంత్రాంగమంతా నెలపాటు ప్రతి ఇంటి తలుపు తట్టాలి. కూటమి ప్రభుత్వ విజయాలను, గత ప్రభుత్వ విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలి. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చిన హామీలు, నెరవేర్చబోతున్న హామీలు, చేసిన పనులను వివరిస్తూ విధ్వంసంనుంచి వికాసంవైపు వేస్తోన్న అడుగులను ప్రజల మెదళ్లకు చేర్చాలి. గత ప్రభుత్వ అరాచకాన్ని, విధ్వంసాన్ని కళ్లకు కట్టాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రధానం. చేసిన పనులను పదేపదే చెప్పడం, చేయకపోతే ఎందుకూ కారణాలను వివరించడమే పార్టీ శ్రేణులు నిర్వర్తించాల్సిన బాధ్యత. జగన్‌రెడ్డి పాలనలో ఆస్తులన్నీ తాకట్టుపెట్టారు. ప్రజాభవనాలన్నీ పరాధీనమైమయ్యాయి. పార్కులు, పాఠశాలలు, బస్టాండులు ప్రకృతి వనరులు.. ఒకటేమిటి పంచభూతాలూ బందీలయ్యాయి. రోజు గడవని ఆర్థిక పరిస్థితి తెచ్చి ఏపీని దివాళా అంచుకు ఈడ్చిన జగన్‌రెడ్డి, తానేదో ఘనకార్యం సాధించినట్టు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలపట్ల కూటమికి జాగరూకత అవసరం. జగన్ సృష్టించిన పెను విధ్వంసానికి యావత్ ఆంధ్ర విలవిల్లాడిరది. మరోసారి బూటకపు కబుర్లుతో ప్రజలను బురిడీ కొట్టించకముందే.. కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లాలి. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ఏకరువు పెట్టడమే కాదు, ఏపీకి వినాశకారిగా పరిణమించిన జగన్మోహన్‌రెడ్డి వికృతాన్నీ ప్రజలకు వివరించాలి. వికాసానికి, విధ్వంసానికి మరోసారి జరుగుతున్న యుద్ధమే ఇది. ఈ యుద్ధంలో `అభివృద్ధి నిరోధక భూతాన్ని శాశ్వతంగా కట్టడి చేయడమే కూటమి ముందున్న సవాల్!
నీరుకొండ ప్రసాద్