అమరావతి (చైతన్య రథం): తన సతీమణి నారా భువనేశ్వరికి ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. ‘‘భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం, పునాది. ప్రతి ఒడిదొడుకులలో నా పక్కనే ఉన్నారు. ఆమె నా జీవితానికి వెలుగు. భువనేశ్వరి నా జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞుడిని. వ్యాపారం, దాతృత్వం.. ఇలా అన్నింట్లో ఆమె నాయకత్వం మాకు స్ఫూర్తి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.