అమరావతి (చైతన్య రథం): మంత్రి నారా లోకేశ్ తన తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెడుతూ.. ‘నాకు స్ఫూర్తి, మెంటార్, మార్గదర్శి, బాస్ మా నాన్నే.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న’ అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసున్న ఓ ఫొటోను షేర్ చేశారు.