- మీ అక్రమాలే అందరికీ అంటగడితే ఎలా?
- ఈనో పంపుతాను, మంట తగ్గించుకోండి
- జగన్‌రెడ్డి దుష్ప్రచారంపై లోకేష్ సెటైర్లు
అమరావతి (చైతన్య రథం): తల్లికి వందనం అద్వితీయ విజయం సాధించటంతో తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్‌రెడి కడుపు మంట మూడిరతలు పెరిగిందని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘ఆరుగురుకంటే ఎక్కువమంది పిల్లలున్న తల్లులు, అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని వెల్లడిరచారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం జగన్‌రెడ్డి బ్రాండ్. వైకాపా పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం, తప్పు చెయ్యం. చెయ్యనివ్వం. జగన్‌రెడ్డికి కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుతుంది’ అంటూ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.