అమరావతి (చైతన్య రథం): ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్యవరం యోగా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈనెల 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికా పోస్టు పెడుతూ.. ‘‘ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగా మన జీవన విధానం కావాలి. ఈనెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. రండి, మీరూ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.