- ప్రజా సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
- ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తాం
- రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా చేయడమే లక్ష్యం
- జగన్‌రెడ్డిలా మాట మార్చడం తెలియదు
- మహిళలపై వ్యాఖ్యలు జగన్ స్క్రిప్ట్ ప్రకారమే
- మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల
మచిలీపట్నం(చైతన్యరథం): ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టా లున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందు కువెళుతుందని, అందుకు నిదర్శనమే తల్లికి వందనం పథకమని ఎక్సైజ్ మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యా లయంలో మీడియాతో మాట్లాడారు. స్కూళ్లు తెరిచే నాటికి ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేలు ఇస్తామన్న హామీ మేరకు పథకం అమలు చేసి చూపించామని వివరించారు. గతం లో జగన్‌రెడ్డి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచాక కోతలు పెట్టి దగా చేశాడని మండిపడ్డారు. కానీ నేడు దాదాపు 67 లక్షల మం దికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేశాం.. స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా మార్చి విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండేలా నియామకాలకు శ్రీకారం చుట్టాం. తాజాగా పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ స్కూళ్లు సాధించిన ఫలితాలు ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ కేంద్రంగా మార్చాలని ముఖ్య మంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఫలితాలొచ్చాయని తెలిపారు. తల్లికి వందనం పథకంలో అత్యధిక లబ్ధిదారులు పేదలే కావడం సంతోషకరమన్నారు.
ఏ విద్యార్థి కూడా ఆర్థిక సమస్యలతో చదువు కు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ప్రతి బిడ్డకీ ఇస్తామన్నాం. ఇచ్చి చూపించాం. పారదర్శకమైన పాలన చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రపం చంలో ఎక్కడా లేని విధంగా మద్యంలో వేల కోట్ల కుంభకోణం చేశారు. విచారణ చేస్తున్న అధికారులు, పోలీసులను బెదిరించి ఏం చేయాలనుకుంటున్నారో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మహిళలపై జగన్‌రెడ్డి, రౌడీ మూకలు అనుసరిస్తున్న విధానాలే వారి మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మోటమ ర్రి బాబాప్రసాద్, గోపు సత్యనారాయణ, బత్తిన దాస్, కుంచె నాని, మాదివాడ రాము,ఇలియాస్ పాషా, లాగిశెట్టి స్వామి, కాగిత గోపా లరావు, పల్లపాటి సుబ్రహ్మణ్యం, కాగిత వెంకటేశ్వరరావు, వంక వెంకటేశ్వరరావు, అన్నం ఆనంద్, లంకెశెట్టి నీరజ, కర్రెడ్ల సుశీల, పి.వి.ఫణికుమార్, చిల్లిముంత ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.