- ఐదేళ్లకు ఇవ్వాల్సింది రూ.50,000 కోట్లు..ఇచ్చింది కేవలం రూ.23,877 కోట్లే
- రూ.26 వేల కోట్ల పైనే తల్లులకు ఎగనామం
- లబ్ధిదారుల సంఖ్యలోనూ భారీగా కోత విధించారు
- 2021లో 44,48,865 లబ్ధిదారులు ఉంటే.. 2023 నాటికి 42,61,965 మందిని చేశారు
- తల్లికి వందనం పథకం అమలుతో సీఎం చంద్రబాబు మాట నిలుపుకున్నారు
- ఎంతమంది పిల్లలున్నా నగదు జమ చేస్తున్నారు
- 67,27,164 మంది బిడ్డలకు నిధుల విడుదల
- గతం కంటే 25 లక్షల మందికి అదనంగా మేలు
- కూటమి ప్రభుత్వం నేడు రూ.8,745 కోట్లు వేస్తే..జగన్ చివర విడతలో వేసింది రూ.5,540 కోట్లే
- అంటే లోకేష్ నాయకత్వంలో తల్లికి వందనానికి గతం కంటే 58 శాతం అధికంగా నిధులు
- రూ.3,205 కోట్లు అదనంగా కేటాయించారు
- లోకేష్ సవాల్‌ను స్వీకరించే ధైర్యం వైసీపీ పార్టీలో ఎవరికీ లేదు
- ఆరోపణలను నిరూపించలేక పారిపోయారు
- చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందే
- రాష్ట్ర ప్రజలు వాస్తవాలు గ్రహించాలి
మంగళగిరి(చైతన్యరథం): అమ్మఒడి పేరుతో తల్లులకు జగన్‌రెడ్డి చేసిన దగాను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టా భిరామ్ బట్టబయలు చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాల యంలో ఆదివారం విలేకరుల సమావేశంలో అమ్మఒడి పథకం కింద జగన్ చేసిన మోసం, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అదనంగా ఇస్తున్న నిధుల వివరాలను గణాంకాలతో సహా ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా పట్టా భి మాట్లాడుతూ వైసీపీ నాయకులు, జగన్‌రెడ్డి కొన్నిరోజులుగా తల్లికి వందనం పథకం అమలుపై అనేక రకాలుగా బురద జల్లుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నిజాయి తీగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పథకా నికి రూ.10,090 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. 67,27,164 మంది బిడ్డలకు తల్లికి వందనం పథకం అమలయ్యే లా చర్యలు తీసుకున్నారు. అయినా వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా దానిపై బురద జల్లుతున్నారని ధ్వజమె త్తారు.
సవాల్‌ను స్వీకరించకుండా పారిపోయారు
పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొంత నిధులు జమ చేస్తుంటే ఆ డబ్బులు లోకేష్ అకౌంట్లోకి వెళ్లాయని అకారణంగా బురదజల్లే కార్యక్రమం చేపట్టారు. ఆధారాలతో రుజువు చేయండి..లేకుంటే బహిరంగ క్షమాపణ కోరాలని లోకేష్ సవాల్ విసిరారు..క్షమాపణ కోరకపోతే చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు..ఇప్పటివరకు ఎవరూ సవాల్‌ను స్వీకరించలేదు. దీంతో వారికి దమ్ము, ధైర్యం లేదని రుజువైంది. ఇచ్చిన సమయం ముగి సింది..ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలి.. లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా బులుగు ముఠా ఎక్కడ దాక్కు న్నారు? జగన్ ండ్డి తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, ఇడుపు లపాయి ప్యాలెస్‌లలో ఎక్కడ దాక్కున్నారో తెలియదు.. చేతిలో అవి నీతి పత్రిక, బురద ఛానల్ ఉన్నాయి కదా అని ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జరుగుతున్న మంచిపనికి సహకరించక పోగా బురద జల్లుతున్నారు. తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు జగన్ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
జగన్‌రెడ్డి ఐదేళ్లలో ఇచ్చింది రూ.23,877 కోట్లే
జగన్‌రెడ్డి గతంలో రాష్ట్రంలోని తల్లులందరినీ మోసం చేశాడు. ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు సారథó్యంలో ప్రతి బిడ్డకూ న్యాయం చేస్తోంది. కూటమి నాయకులు వైసీపీ నాయకుల్లాగా నిరాధార ఆరోపణలు చేయరు. గతంలో జగన్, భారతీరెడ్డిలు 2019లో ఇం టింటికి వెళ్లి ఒక బిడ్డను బడికి పంపితే రూ.15 వేలు, ఇద్దరిని పంపితే రూ.30 వేలు, ముగ్గురికి రూ.45 వేలు ఇస్తామని చెప్పి తర్వాత వారిని దగా చేశారు. అర్హులైన 67,27,164 మంది విద్యార్థులకు సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ప్రతి సంవత్స రం రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.50 వేల కోట్లు జగ న్‌రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాల్సి ఉండగా వేసింది 2020లో రూ. 6349 కోట్లు, 2021లో రూ.6228 కోట్లు, 2022లో రూ.5715 కోట్లు, 2023లో రూ.5540 కోట్లు, 2024 జనవరిలో కేవలం రూ.45 కోట్లు జమ చేశారు. మొత్తంగా జగన్‌రెడ్డి ఇచ్చింది కేవలం రూ.23,877 కోట్లు. 2019 ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకా రం ఐదేళ్లకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.23,877 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే సుమారు రూ.26 వేల కోట్లు తల్లులకు ఎగనామం పెట్టి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు.
ఇచ్చిన దాంట్లోనూ కోతలు
ఇచ్చిన దాంట్లో కూడా ప్రతిసంవత్సరం తగ్గించుకుంటూ పోయా రు. జగన్ కోతల మాస్టర్. ఇస్తానన్నది ఇవ్వకుండా పథకం అమ లు చేసినప్పటి నుంచి తగ్గించుకుంటూ వచ్చాడు. మొత్తం ఇచ్చింది 23,877 కోట్లు మాత్రమే ఇచ్చారు. టాయిలెట్స్ మెయింటెనెన్స్ పేరుతో కోతలు పెట్టారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్లు కోత పెట్టారు. రాష్ట్రంలోని పాఠశాలలను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. 2021లో జగన్‌రెడ్డి రెండో విడత అమ్మఒడికి 6,673 కోట్లకు జీవో విడుదల చేసి మళ్లీ రూ.445 కోట్లు కోత పెట్టి రూ.6228 మాత్రమే కోట్లు మాత్రమే ఖాతాల్లో వేశారు. తిరిగి మూడో విడత కూడా రూ.6,593 కోట్లకు జీవో ఇచ్చి ఇందులో రూ.880 కోట్లు కటింగ్ పెట్టి రూ.5,715 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. నాల్గవ విడత రూ.6,393 కోట్లకు అమ్మఒడి జీవో ఇచ్చి రూ.853 కోట్లు కోత పెట్టి రూ.5,540 కోట్లు ఇచ్చాడు. ఈ విధంగా మొత్తం అమ్మఒడి పథకంలో కోతలన్నీ కలిపి రూ.2,178 కోట్లు కోత పెట్టాడు. నిజాయితీగా, పారదర్శకంగా ఈ డబ్బును పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, టాయిలెట్ల మెయింటెనెన్స్‌కు ఖర్చు చేసి ఉంటే ఏ ఇబ్బందేమీ కలిగేది కాదు.. కానీ ఈ విధంగా కాకుండా పూర్తిగా పక్కదారి పట్టించి జగన్‌రెడ్డి మాయం చేశాడని గణాంకాలతో వివరించారు.
లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు
లబ్ధిదారుల సంఖ్యను కూడా భారీగా తగ్గించుకుంటూ వచ్చా డు. అమ్మఒడి కింద 2020 మొదటి విడత కింద 42.8 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చి 2021 రెండో విడతకు విద్యార్థుల సంఖ్యను 44.4 లక్షలకు పెంచినట్లే పెంచి తిరిగి 2022 మూడ వ విడతకు 43.96 లక్షలకు కుదించాడు. అంటే రెండవ విడత కంటే మూడో విడతకు వచ్చేసరికి 52,500 మంది విద్యార్థుల సంఖ్యను తగ్గించాడు. అదేవిధంగా జూలై 2023 నాల్గవ విడత, చివరి విడత అమ్మఒడికి వచ్చేసరికి విద్యార్థుల సంఖ్యలో ఇంకా కోత పెట్టి 42.6 లక్షలకు పరిమితం చేశాడు. అంటే మూడో విడత విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే నాల్గో విడత అమ్మఒడికి వచ్చేసరికి 1.34 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టాడని ఆధారాలతో వివరించారు.
24.67 లక్షల మందికి అదనంగా తల్లికి వందనం
కానీ, నేడు చంద్రన్న ప్రభుత్వం నారా లోకేష్ సారథó్యంలో 2025 జూన్ 12న 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. అంటే జగన్‌రెడ్డి 2023లో చివరగా ఇచ్చిన అమ్మఒడి విద్యార్థుల సంఖ్య కంటే 24.67 లక్షల మంది విద్యార్థులకు అదనంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇంతమంది విద్యార్థులను గతంలో జగన్ మోసం చేస్తే నేడు మేము వారికి న్యాయం చేస్తున్నాం. జగన్ చివరి విడత అంటే 2023 జూలైలో అమ్మఒడి పథకానికి రూ.6,393 కోట్లకు జీవో ఇచ్చి రూ.853 కోట్లు మెయింటెనెన్స్ కు తీసుకొని (ఆ డబ్బులు ఎటు పోయాయో తెలియదు) కేవలం రూ.5,540 కోట్లు తల్లుల ఖాతాల్లో వేశాడు. కానీ మన చంద్ర న్న ప్రభుత్వం ఈ జూన్ 12న తల్లికి వందనం పథకానికి రూ.10,090 కోట్లు విడుదల చేసి దానిలో స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చ ర్‌కు రూ.1345 కోట్లు జిల్లా కలెక్టర్ల అకౌంట్‌లలో వేయడం జరిగింది. రూ.8745 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అంటే గతంలో జగన్‌రెడ్డి ఇచ్చిన దానికంటే ఒకే సారి 58 శాతం పెంచి రూ.3,205 కోట్లు అదనంగా రూ.8,745 కోట్ల రూపాయలు నేడు తల్లుల ఖాతాల్లో జమచేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చినట్లు వివరిం చారు.
పేటీఎం బ్యాచ్ సమాధానం చెప్పాలి
జగన్‌లాగే ప్రతి ఏడాది కోతలు పెట్టలేదు. కోతలు పెట్టటం, మోసం చేయడం మాకు చేతకాదు. దీనికి పేటీఎం బ్యాచ్ సమా ధానం చెప్పాలి. ఒక్కరే సంతానం కలిగిన 18.55 లక్షల మంది తల్లులు, ఇద్దరు పిల్లలు కలిగిన 14.55 లక్షల మంది తల్లులకు, , ముగ్గురు పిల్లలున్న 2.10 లక్షల మంది తల్లులకు, నలుగురు పిల్లలు కలిగిన 20 వేల మంది తల్లులకు నేడు లబ్ధి చేకూర్చి వారిలో చంద్రబాబు ఆనందం నింపారు. వైసీపీ పాలనలో పిల్లల్లో ఏ బిడ్డకు నేను చదివించుకోవాలనే సతమతమయ్యే పరిస్థితి ఉండేది..కానీ నేడు చంద్రన్న ప్రభుత్వం 67 లక్షల మంది విద్యా ర్థులకు లబ్ధి చేకూర్చి తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా నిజమైన సంతోషాన్ని కలిగిస్తుంటే జగన్‌రెడ్డికి కడుపు మంట. ప్రజలు సంతోషంగా ఉంటే జగన్‌కు పట్టదు. అందుకే జగన్‌ను సైకో జగన్ అంటారు. నిర్మాణాత్మ కమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఉంటే ప్రశంసించి ఉండేవాడి వి.. హుందాతనం జగన్ డీఎన్‌ఏలోనే లేదు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలు గ్రహించాలని సూచించారు.