- టెక్కలిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శ్రీకాకుళం(చైతన్యరథం): తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది పైనే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసి చంద్రబాబు వారి కళ్లలో ఆనందం నింపారని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గం రావివలస పంచాయతీ పరిధిలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లూ పల్లెల అభివృద్ధిని పూర్తి గా వదిలేసింది..హామీలకే పరిమితమైంది.. కనీస మౌలిక సదుపా యాలు కల్పించకపోవడంతో ప్రజలు కష్టాలు పడ్డారని విమర్శిం చారు. గ్రామాలు అభివృద్ధి దిశగా నడిపేందుకు కూటమి ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తల్లికి వందనం పథకం అమలు చేసి 67 లక్షల మంది లబ్ధిదారులకు ఖాతాలో నగదు జమ చేశామని చెప్పారు. తల్లికి వందనం అమలు కూటమి ప్రభు త్వం ఘనత అన్నారు. సూపర్‌సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు తెరిచిన రోజే, పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, బూట్లు, సాక్సులు పిల్లలకు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రావివలస గ్రామ ప్రధాన వీధిలో రూ.80 లక్షలు, దామోదరపురంలో రూ.90 లక్షలు, చిన్న నారాయణ పురంలో రూ.60 లక్షలతో సీసీ రహదారులు, కాలువలు నిర్మాణ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పాత కాలనీలో రూ.51 లక్షలు, కొత్త కాలనీలో రూ.60 లక్షలతో కాలు వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నౌపడ- రహ దారి నుంచి చిన్ననారాయణపురం గ్రామానికి ఇరువైపులా రక్షణ గోడల నిర్మా ణం కోసం రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు, రూ.50 లక్షలతో కల్వ ర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చిన్ననారాయణపురం ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో రహదారి, రూ.30 లక్షలతో శ్మశానవాటికకు మార్గం, రావివలస, దామోదరపురం, చిన్ననారా యణపురం గ్రామాల్లో శ్మశానవాటికల అభివృద్ధికి రూ.75 లక్షలు, రావివలస నుంచి ఎండలమల్లికార్జున స్వామి దేవస్థానానికి రూ.3 కోట్లతో రహదారి, కొత్తకాలనీలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు, డ్వాక్రా భవనం నిర్మాణానికి రూ.30 లక్షలతో పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్న ల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణమూర్తి, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.