అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన చర్చ నిర్వహించినందుకు సాక్షి టీవీపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేసు నమోదు చేసింది. సాక్షి టీవీపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 8న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. వేశ్యల రాజధాని అంటూ మహిళలను అవమానించారని ఫిర్యాదులో లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. లావు విజ్ఞప్తి మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసు నమోదు చేసింది.